>ముద్దుగుమ్మ సమంత.. 'జాంబీ రెడ్డి' తొలి బైట్‌ను శనివారం(డిసెంబరు 5) ఉదయం 11:15 గంటలకు విడుదల చేయనుంది. తేజ, ఆనందిని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకుడు.
>రాజ్‌తరుణ్, హెబ్బా పటేల్ నటించిన 'ఒరేయ్ బుజ్జిగా' సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఓటీటీలో వచ్చి, ప్రేక్షకుల ఆకట్టుకోవడం వల్ల జనవరి 1న మరోసారి రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.
>శర్వానంద్ 'శ్రీకారం' సినిమాలోని 'భలేగుంది బాలా' పాట కోటి వ్యూస్ దాటేసింది. ఈ మైలురాయిని ఇటీవల మరణించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు అంకితమిస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది.
>నాని కొత్త సినిమా 'టక్ జగదీష్'.. చివరి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఐశ్వర్య రాజేశ్, రీతూ వర్మ హీరోయిన్లుగా నటిస్తుండగా, శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. 2021 ప్రథమార్ధంలో థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
>అక్షయ్ కుమార్.. తన కొత్త సినిమా 'అతిరంగీ దే' షూటింగ్లో పాల్గొన్నారు. ఈ మేరకు ఫొటోను విడుదల చేశారు. ఇందులో సారా అలీఖాన్, ధనుష్.. ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు.
>ఆదిత్య రాయ్ కపూర్, సంజనా సంఘీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'ఓమ్'. గురువారం షూటింగ్ ప్రారంభమవగా, శుక్రవారం(డిసెంబరు 4) ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. గన్ పట్టుకుని ఉన్న ఆదిత్య స్టిల్ ఆకట్టుకుంటోంది.
>కియారా అడ్వాణీ ప్రధాన పాత్రలో నటించిన 'ఇందూ కీ జవానీ'.. డిసెంబరు 11న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కొత్త పోస్టర్‌ను కూడా పంచుకున్నారు.
-
1 Crore views & counting for #BhalegundhiBaala from our #Sreekaram..Thank u all for the love❤️!!
— ram achanta (@RaamAchanta) December 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Dedidicating this milestone to our Legendary #SPB gaaru.
👉 https://t.co/L2Mr0k348Q
A @MickeyJMeyer Musical !! pic.twitter.com/8bgPmFioh9
">1 Crore views & counting for #BhalegundhiBaala from our #Sreekaram..Thank u all for the love❤️!!
— ram achanta (@RaamAchanta) December 4, 2020
Dedidicating this milestone to our Legendary #SPB gaaru.
👉 https://t.co/L2Mr0k348Q
A @MickeyJMeyer Musical !! pic.twitter.com/8bgPmFioh91 Crore views & counting for #BhalegundhiBaala from our #Sreekaram..Thank u all for the love❤️!!
— ram achanta (@RaamAchanta) December 4, 2020
Dedidicating this milestone to our Legendary #SPB gaaru.
👉 https://t.co/L2Mr0k348Q
A @MickeyJMeyer Musical !! pic.twitter.com/8bgPmFioh9