ఏటా సెప్టెంబరులో సినిమాల జోరు కాస్త తక్కువగా ఉన్నప్పటికీ విడుదలైన వాటిలో కనీసం మంచి విజయాలైనా ఉంటాయి. గతేడాదితో పోలిస్తే ఈ సారి పెద్దగా ఆడలేదనే చెప్పాలి. డబ్బింగ్ చిత్రాలతో కలిపి డజనుకుపైగా విడుదలైతే 'గద్దలకొండ గణేష్' మినహా మిగతావి చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రేక్షకాదరణ దక్కించుకోలేకపోయాయి.
అంచనాలు అందుకోలేకపోయిన సాహో..
సెప్టెంబరు మొదటివారంలో ఏకంగా 7 సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. ఆగస్ట్ 30న సాహో రిలీజ్ కావడం వల్ల ఫస్ట్‌వీక్‌లో పెద్ద చిత్రాలేవి కనిపించలేదు. వసూళ్లు సాధించినప్పటికీ ఫ్లాప్ టాక్ తెచ్చుకుందీ చిత్రం. ఈ వారంలో విడుదలైన ఏడింటిలో జోడీ మాత్రమే కాస్త తెలిసిన చిత్రం. ఆది సాయికుమార్, జెర్సీ ఫేం శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటించిన ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఉండిపోరాదే, దర్పణం, 2 అవర్స్ లవ్, వీడే సరైనోడు, నీకోసం, తారామణి.. లాంటి చిత్రాలన్నీ ఎలాంటి చడీచప్పుడు చేయకుండా ఇలా వచ్చి అలా వెళ్లిపోయాయి.
టాక్ బాగున్నా.. కలెక్షన్లు వీక్..
రెండో వారంలో 'గ్యాంగ్‌లీడర్'తో నాని సందడి చేశాడు. విక్రమ్ కె కుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో కొత్తదనం ఆశించిన ప్రేక్షకులు నిరాశకు లోనయ్యారు. టాక్ బాగున్నా.. వసూళ్లు మాత్రం సాధించలేకపోయింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.21 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా అనుకున్న కలెక్షన్లు సాధించలేకపోయింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
పసలేని పహిల్వాన్..
సుదీప్ హీరోగా నటించిన 'పహిల్వాన్' సినిమాను పాన్-ఇండియా మూవీగా ప్రమోషన్ నిర్వహించారు. అయితే ఈ చిత్ర సగటు కన్నడ సినిమా కంటే దిగువస్థాయిలో ఉంది. తెలుగులో ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. శ్రీకాంత్ విలన్ గా నటించిన మార్షల్ సినిమా కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.
గణేష్ దెబ్బకు బాక్సాఫీస్ గజ గజ..
మూడోవారంలో వరుణ్ తేజ్ నటించిన 'గద్దలకొండ గణేష్' థియేటర్లలోకి వచ్చేసింది. తమిళ చిత్రం 'జిగర్తాండ'కు రీమేక్ ఇది. విడుదలైన వారం రోజుల్లోనే మంచి వసూళ్లు సాధించింది. హరీష్ శంకర్ రాసుకున్న మాస్ ఎలిమెంట్స్, చేసిన ప్రమోషన్‌తో 'గద్దలకొండ గణేష్' .. వాణిజ్య పరంగానూ మంచి విజయం అందుకుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'బందోబస్త్'తో బోర్ కొట్టించిన సూర్య..
గద్దలకొండ గణేష్‌తో పాటు వచ్చిన బందోబస్త్ మాత్రం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించింది. కేవీ ఆనంద్ దర్శకత్వంలో సూర్య నటించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు రుచించలేదు. వసూళ్లు రాక ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ వారంలో వచ్చిన నేను నా నాగార్జున, పండుగాడి ఫొటో స్టూడియో సినిమాలూ డిజాస్టర్లుగా మారాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇలా వచ్చి అలా వెళ్లిన చిన్నసినిమాలు..
సెప్టెంబరు ఆఖరి వారంలోనూ ఎలాంటి మెరుపుల్లేవు. సైరాను దృష్టిలో పెట్టుకొని ఎవరూ పెద్ద సినిమాల్ని విడుదల చేయలేదు. రాయలసీమ లవ్ స్టోరీ, నిన్ను తలచి, రామ చక్కని సీత లాంటి 5 చిన్న సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. ఇవన్నీ ఇలా వచ్చి అలా వెళ్లాయి.
మొత్తంగా సెప్టెంబరులో 'గద్దలకొండ గణేష్' మినహా మిగతా చిత్రాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. వరుణ్‌తేజ్ మంచి కమర్షియల్ విజయాన్ని అందుకున్నాడు.
ఇదీ చదవండి: కోపంలో ఐశ్వర్యరాయ్ అభినయం చూశారా..?