ETV Bharat / sitara

'ఢీ' సీక్వెల్​ 'డబుల్ డోస్'.. 'అరవింద సమేత' రికార్డు - అరవింద సమేత డబ్బింగ్ వెర్షన్ రికార్డు

టాలీవుడ్​, బాలీవుడ్​ నుంచి కొత్త అప్​డేట్స్ వచ్చేశాయి. ఇందులో 'ఢీ' సీక్వెల్ పేరు 'డబుల్​ డోస్', 'అరవింత సమేత' వ్యూస్ రికార్డు, చైతూ, విష్ణు కొత్త సినిమాల పోస్టర్లు, 'దుర్గమతి' చిత్ర విడుదల తేదీ ఉన్నాయి.

movie updates latest from 'dhee' movie sequel, 'aravindha sametha', 'love story', bhumi 'durgavati'
'ఢీ' సీక్వెల్​ 'డబుల్ డోస్'.. 'అరవింద సమేత' రికార్డు
author img

By

Published : Nov 23, 2020, 11:25 AM IST

Updated : Nov 23, 2020, 11:52 AM IST

> తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన చిత్రాల్లో ఒకటి 'ఢీ'. దీని సీక్వెల్​కు 'డబుల్ డోస్' టైటిల్​ను నిర్ణయిస్తూ సోమవారం(నవంబరు 23) ప్రకటన చేశారు. హీరో విష్ణు పుట్టినరోజు సందర్భంగా పోస్టర్​ను కూడా విడుదల చేశారు. 'ఢీ' తీసిన శ్రీను వైట్లనే దీనికి దర్శకత్వం వహించనున్నారు.

> జూ.ఎన్టీఆర్​ 'అరవింద సమేత' మళ్లీ రికార్డులు సృష్టిస్తోంది. అదేంటి ఎప్పుడో 2018లో విడుదలైంది కదా.. ఇప్పుడు రికార్డులేంటి అనుకుంటున్నారా? హిందీ డబ్బింగ్ వెర్షన్​ను యూట్యూబ్​లో ఆదివారం విడుదల చేయగా, కేవలం ఒక్కరోజులోనే 10 మిలియన్​ వ్యూస్​ సాధించడం సహా మూడు లక్షలకు పైగా లైకులను సొంతం చేసుకుంది.

> హీరోలు నాగచైతన్య, మంచు విష్ణుల పుట్టినరోజు సందర్భంగా వారు నటిస్తున్న 'లవ్​స్టోరి','మోసగాళ్లు' సినిమాల నుంచి కొత్త పోస్టర్లు విడుదలయ్యాయి. చైతూ లుంగీ లుక్​తో అలరిస్తుండగా, విష్ణు స్టైలిష్​గా చూస్తూ ఆసక్తి రేపుతున్నారు.

> సుశాంత్ సింగ్ చివరి చిత్రం 'దిల్​ బెచారా'లో హీరోయిన్​గా నటించిన సంజనా సంఘీ.. బాలీవుడ్​లో రెండో ప్రాజెక్టుకు అంగీకారించింది. ఆదిత్య రాయ్ కపూర్ హీరోగా నటిస్తున్న 'ఓమ్'లో కథానాయికగా సంజన కనిపించనుంది. కపిల్ వర్మ దర్శకత్వం వహించనున్నారు.

> అనుష్క 'భాగమతి' హిందీ రీమేక్ 'దుర్గమతి' విడుదలకు సిద్ధమైంది. డిసెంబరు 11 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. భూమి ఫెడ్నేకర్ ప్రధాన పాత్రలో నటించగా, మాతృక తీసిన అశోక్ దీనికి కూడా దర్శకత్వం వహించారు.

ఇది చదవండి: మాల్దీవుల్లో సమంత.. రౌడీ హీరో ప్రశంసలు

Last Updated : Nov 23, 2020, 11:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.