ETV Bharat / sitara

ఓటీటీలో నాగ్ 'వైల్డ్​డాగ్'.. క్రిస్మస్​కు 'కూలీ నం.1' - టాలీవుడ్ వార్తలు

సినిమాల కొత్త అప్​డేట్స్ వచ్చేశాయి. ఇందులో నాగార్జున 'వైల్డ్​డాగ్', వరుణ్ ధావన్ 'కూలీ నం.1', నితిన్​ 'రంగ్​దే' చిత్రాలకు సంబంధించిన సమాచారం ఉంది.

movie updates from wild dog, coolie no.1, rangde, enemy
ఓటీటీలో నాగ్ 'వైల్డ్​డాగ్'.. క్రిస్మస్​కు 'కూలీ నం.1'
author img

By

Published : Nov 26, 2020, 12:38 PM IST

స్టార్ హీరో నాగార్జున 'వైల్డ్​డాగ్'.. త్వరలో ఓటీటీలోనే విడుదల కానుంది. ఇప్పటికే నెట్​ఫ్లిక్స్​ హక్కులు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. కొన్నిరోజుల్లో ఈ విషయమై అధికారిక ప్రకటన రానుంది. ఈ చిత్రంలో ఎన్​ఐఏ అధికారి విజయ్ వర్మగా నాగ్ కనిపించనున్నారు. చివరి దశ చిత్రీకరణలో ఉంది.

wild dog team
వైల్డ్​డాగ్​ సినిమాలోని నటీనటులు

క్రిస్మస్​కు వరుణ్ 'కూలీ నం.1'

బాలీవుడ్​ హీరో వరుణ్ ధావన్- సారా అలీఖాన్ జంటగా నటించిన చిత్రం 'కూలీ నం.1'. అమెజాన్ ప్రైమ్ వేదికగా క్రిస్మస్​కు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 28న ట్రైలర్​ను విడుదల చేయనున్నారు. ప్రముఖ దర్శకుడు డేవిడ్ ధావన్ 45వ చిత్రమిది. 1983లో వచ్చిన 'కూలీ' సినిమాకు ఇది రీమేక్​.

coolie no.1 poster
కూలీ నం.1 పోస్టర్

'ఎనిమీ'లో విలక్షణ నటుడు ప్రకాశ్​రాజ్

కోలీవుడ్​ నటులు విశాల్-ఆర్య నటిస్తున్న మల్టీస్టారర్​కు 'ఎనిమీ' టైటిల్​ను నిర్ణయించారు. ఇందులో విలక్షణ నటుడు ప్రకాశ్​రాజ్​ కూడా కీలకపాత్ర చేస్తున్నట్లు చిత్రబృందం గురువారం వెల్లడించింది. తమన్ సంగీతమందిస్తుండగా, ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.

prakash raj
విలక్షణ నటుడు ప్రకాశ్​రాజ్

దుబాయ్​లో 'రంగ్​దే'

నితిన్-కీర్తి సురేశ్​ల 'రంగ్​దే' షూటింగ్ దుబాయ్​లో జరుగుతోంది. ఈ క్రమంలోనే ఓ ఫొటో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. రొమాంటిక్​ ఎంటర్​టైనర్​ తీస్తున్న ఈ చిత్రం.. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. వెంకీ అట్లూరి దర్శకుడు, దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు.

nithiin keerthy suresh
రంగ్​ దే సినిమాలో నితిన్ కీర్తి సురేశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.