>కోలీవుడ్ హీరో విజయ్ 'మాస్టర్' తెలుగు టీజర్.. గురువారం సాయంత్రం 6 గంటలకు విడుదల కానుంది. ఇందులో విజయ్ ఉపాధ్యాయుడిగా కనిపించనున్నారు. ఇప్పటికే వచ్చిన తమిళ టీజర్ రికార్డులు సృష్టిస్తోంది. మరి తెలుగులో ఇంకెన్ని రికార్డులు బద్ధలు అవుతాయో చూడాలి.
>26/11 దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తీస్తున్న సినిమా 'మేజర్'. పాన్ ఇండియా కథతో తెరకెక్కిస్తుండగా, టాలీవుడ్ నటుడు అడివి శేష్ టైటిల్ రోల్ చేస్తున్నారు. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు ఫస్ట్‌లుక్ విడుదల చేయనున్నారు.
>ప్రముఖ నటుడు అలీ నిర్మాణంలో తొలిసారి, 'అందరూ బాగుండాలి అందులో నేనుండాలి' సినిమా తీస్తున్నారు. బుధవారం ఉదయం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ఇందులో అలీ, నరేశ్, మౌర్యానీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సిరిపురం కిరణ్ దర్శకుడు.
>కథానాయకుడు సందీప్ కిషన్ కొత్త సినిమా 'రౌడీ బేబీ'. టైటిల్ ప్రకటించడం సహా షూటింగ్ ప్రారంభమైనట్లు బుధవారం ప్రకటించారు. కేతిక శర్మ హీరోయిన్. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
>శ్రీవిష్ణు నటిస్తున్న 'గాలి సంపత్' తొలి షెడ్యూల్ విశాఖపట్నంలో ముగించింది. దీంతో 80 శాతం చిత్రీకరణ పూర్తయిందని వెల్లడించారు. అనిల్ రావిపూడి కథను అందిచడం సహా నిర్మిస్తున్నారు. అనీష్ కృష్ణ దర్శకుడు. రాజేంద్రప్రసాద్ హీరోకు తండ్రిగా నటిస్తున్నారు.
>'సెహరి' ఫస్ట్‌లుక్ విడుదలైంది. హర్ష్, సిమ్రాన్ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. జ్ఞానసాగర్ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
>రాయ్ లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న 'గర్జన' మోషన్ టీజర్ విడుదలైంది. ఇందులో పులికి సంబంధించిన సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. పార్ధిబన్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో సినిమాను త్వరలో రిలీజ్ చేయనున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">