లాక్డౌన్ తర్వాత థియేటర్లు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకోవడం వల్ల ప్రతి వారం సినిమాలు వచ్చేస్తున్నాయి. ఈసారి కూడా అలా కొన్ని చిత్రాలు వచ్చేస్తుండగా, ఓటీటీలోనూ కొత్త సినిమాలు/వెబ్ సిరీస్ సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. వాటి గురించే ఈ కథనం.
రెండు థియేటర్లో.. ఒకటి ఓటీటీలో
తెలుగులో శుక్రవారం మొత్తంగా మూడు సినిమాలు అభిమానుల్ని కనువిందు చేయనున్నాయి. అందులో ప్రేమకథతో తెరకెక్కిన 'డియర్ మేఘ', విభిన్న కథాంశంతో రూపొందిన 'నూటొక్క జిల్లాల అందగాడు' వెండితెరపై ఆకట్టుకునేందుకు రెడీగా ఉన్నాయి. మరోవైపు గతనెలలో థియేటర్లలో విడుదలైన విశ్వక్సేన్ 'పాగల్'.. శుక్రవారం నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.
హాలీవుడ్ నుంచి తగ్గేదే లే..
ఇంగ్లీష్ అనువాద చిత్రాలు, వెబ్ సిరీస్లు సినీ వీక్షకుల్ని అలరించేందుకు రెడీ అయ్యాయి. 'షాంగ్ చై అండ్ ద లెజెండ్ ఆఫ్ టెన్ రింగ్స్', 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9' సినిమా థియేటర్లలో విడుదల కానుండగా.. గత కొన్నేళ్లుగా అలరిస్తున్న 'మనీ హైస్ట్' వెబ్ సిరీస్ ఐదో సీజన్ వాల్యూమ్ 01.. నెట్ఫ్లిక్స్లో శుక్రవారం నుంచే అందుబాటులోకి వచ్చింది.
ఇవీ చదవండి: