ETV Bharat / sitara

ఆ జిల్లాలో చారిత్రక జంక్షన్​కు సుశాంత్​ పేరు

యువ కథానాయకుడు సుశాంత్​ స్వస్థలమైన, బిహార్​ పూర్ణియాలోని ప్రఖ్యాత ఫోర్డ్​ కంపెనీ జంక్షన్​కు అతడి​ పేరు పెట్టారు. ఈ మేరకు జిల్లా మేయర్​ సవితా దేవి స్పష్టం చేశారు.

ఆ జిల్లాలో చారిత్రక జంక్షన్​కు సుశాంత్​ పేరు
సుశాంత్ సింగ్ రాజ్​పుత్
author img

By

Published : Jul 10, 2020, 2:18 PM IST

Updated : Jul 10, 2020, 3:25 PM IST

బాలీవుడ్​ నటుడు సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​కు తన స్వస్థలం పూర్ణియా జిల్లా వాసులు గొప్ప నివాళి అర్పించారు. నగరంలోని చారిత్రాత్మక ఫోర్డ్​ కంపెనీ జంక్షన్​కు ఇతడి​ పేరు పెట్టారు. దీనితోపాటే మధుబని నుంచి మాతా ప్రాంతాన్ని అనుసంధానం చేసే దారిని ఇకపై సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ మార్గం అని పిలవనున్నారు. ఈ మేరకు జిల్లా మేయర్​ సవితా దేవి స్పష్టం చేశారు.

చారిత్రక జంక్షన్​కు సుశాంత్​ పేరు

మున్సిపల్​ కార్పోరేషన్​లో వాయిస్​ ఓటింగ్​ పద్దతి ద్వారా ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చినట్లు మేయర్​ తెలిపారు. అంతే కాకుండా, సుశాంత్​ పూర్వీకుల గ్రామం ఈ పూర్ణియా అని.. హీరో మరణించిన తర్వాత అతడి కోసం ఓ స్థూపాన్ని కూడా నిర్మించాలని ప్రజలు డిమాండ్​ చేసినట్లు సవితా దేవి పేర్కొన్నారు. సుశాంత్​ బాల్య స్నేహితుడు, బిహార్​ వికాస్​ మోర్చా అధ్యక్షుడు రాకేశ్​ సింగ్ మట్లాడుతూ.. "ఇది సుశాంత్​కు గొప్ప నివాళి మాత్రమే కాదని, రాష్ట్రానికే గర్వకారణం" అని వెల్లడించారు.

ఇదీ చూడండి:బయో ఎంజైమ్స్​ తయారు చేసిన సమంత

Last Updated : Jul 10, 2020, 3:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.