అక్కినేని అఖిల్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'(most eligible bachelor movie). దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్రబృందం. ఈ వేడుకకు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun movies). ఈ నేపథ్యంలో వారు ఏం మాట్లాడారో చూద్దాం.
- "అల్లు అరవింద్‌తో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. ఆయనతో మాట్లాడితే నా గాడ్ ఫాదర్‌తో మాట్లాడినట్లు ఉంటుంది. మా నాన్నకు ప్రామిస్ చేసినట్లుగానే గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు. మీకు చాలా కృతజ్ఞతలు. మీతో కలిసి మరోసారి పని చేయాలని కోరుకుంటున్నా. ఈ సినిమా కోసం నిజాయతీగా పనిచేశాం. ఓ మంచి సినిమా తీశామనే ధైర్యంతో దసరాకి రిలీజ్ చేశాం. మా సినిమాను ఆదరించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఈ వేడుకకు ప్రత్యేక అతిథిగా వచ్చినందుకు బన్నీకి ప్రత్యేక కృతజ్ఞతలు. 'పుష్ప'తో పాటు మీరు చేసే భవిష్యత్ ప్రాజెక్టులన్నీ సక్సెస్ కావాలని కోరుకుంటున్నా" అని తెలిపారు అఖిల్.
- "మొదటగా అఖిల్‌కు కంగ్రాట్యులేషన్స్. అఖిల్‌ను చూస్తే యంగర్ బ్రదర్ ఫీలింగ్ ఉంటుంది. అఖిల్ డ్యాన్స్, ఫైట్స్ బాగా చేస్తాడు. వీటిని పక్కకు పెట్టి ఓ మంచి కుటుంబకథా చిత్రం చేయాలని భావించి సక్సెస్ సాధించారు. నాగ చైతన్య కూడా ఇటీవల 'లవ్‌స్టోరీ'తో సక్సెక్ కొట్టారు. ఈ విజయాల్ని చూసి మీ తాతయ్య (అక్కినేని నాగేశ్వరావు), నాన్న నాగార్జున గర్వపడుతూ ఉంటారు. 'డీజే' చిత్రం నుంచి పూజా హెగ్డేను చూస్తూనే ఉన్నా. సినిమా సినిమాకూ సక్సెస్ కొడుతోంది. ఈ సినిమాతో మరో రెండు మెట్లు ఎక్కావని అనుకుంటున్నా. దర్శకుడు భాస్కర్ హిట్ కొడతాడని తెలుసు. ఈ సినిమాతో హిట్ కొట్టబోతున్నాడని బన్నీ వాసు చెప్పినపుడు సంతోషంగా ఫీలయ్యా. కంగ్రాట్యులేషన్స్ భాస్కర్. మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్ చాలా బాగా పాటల్ని కంపోజ్ చేశారు. అందరికీ హిట్లు ఇస్తున్నా మీరు నాకెప్పుడు హిట్ ఆల్బమ్ ఇస్తారు. కొవిడ్ సమయంలోనూ థియేటర్లకి వచ్చి సినిమాల్ని ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకి చాలా చాలా థ్యాంక్స్. ఈ సీజన్లో మరికొన్ని సినిమాలు రాబోతున్నాయి. వాటన్నింటికీ ఆల్ ద బెస్ట్. అలాగే డిసెంబర్ 17న 'పుష్ప' రాబోతుంది. తగ్గేదెలే" అంటూ ముగించారు బన్నీ.