"జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదోవిధంగా మోసపోతుంటాం. మోసం నేపథ్యంలో సాగే ఒక అత్యద్భుతమైన కథని ఎంచుకుని 'మోసగాళ్ళు' సినిమాని చేశారు" అన్నారు ప్రముఖ నటుడు మోహన్‌బాబు. ఆయన తనయుడు మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తూ, నిర్మించిన చిత్రమిది. కాజల్ ముఖ్య పాత్రధారి. జెప్రీ గీ చిన్ దర్శకుడు. సునీల్‌శెట్టి ముఖ్య పాత్ర పోషించారు. ఈ చిత్రం ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సోమవారం రాత్రి విడుదలకి ముందస్తు వేడుక జరిగింది. మోహన్‌బాబు, రానా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
మోహన్‌బాబు మాట్లాడుతూ "భారతదేశంలో నాకు తెలిసి ఇలాంటి నేరం జరగలేదు. కుటుంబం, సెంటిమెంట్‌తోపాటు... అర్థం పరమార్థం ఉన్న సినిమా ఇది. సునీల్‌శెట్టి అద్భుతమైన నటుడు. మార్చి 19న నేను పుట్టినరోజు. ఆ రోజు విడుదలవుత్ను ఈ సినిమాని ప్రతి ఒక్కరూ చూస్తారని ఆశిస్తున్న"’ అన్నారు. గాయని కోమలికి తదుపరి తన సినిమాలో పాడే అవకాశం ఇస్తానని తెలిపారు మోహన్‌బాబు.
రానా దగ్గుబాటి మాట్లాడుతూ "ఎనిమిదో తరగతి నుంచి నా ఆరాధ్య నటుడు సునీల్‌శెట్టి. ఆయన్ని తెలుగు సినిమాలో చూస్తున్నందుకు ఆనందంగా ఉంది అన్నారు. సునీల్ శెట్టి మాట్లాడుతూ "మోహన్‌బాబు నటుడిగా నాకు ఆరాధ్యమైన వ్యక్తి, మంచి స్నేహితుడు. మంచి కుటుంబంతో కలిసి చేసే అవకాశం వచ్చింది" అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనువైట్ల, స్టన్ శివ, గౌతంరాజు, డైమండ్ రత్నబాబు, రాజారవీంద్ర, కోమలి, నవదీప్, నివాస్ తదితరులు పాల్గొన్నారు.