పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్.. 'హరిహర వీరమల్లు', 'అయ్యప్పనుమ్ కోశియమ్' రీమేక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. దీని తర్వాత హరీశ్ శంకర్ దర్శకత్వంలో నటిస్తారు. అయితే ఈ సినిమా ప్రారంభం మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది.
దాదాపు రెండేళ్ల క్రితమే హరీశ్ శంకర్‌తో పవన్ కలిసి పనిచేయనున్నట్లు ప్రకటించారు. 'గబ్బర్‌సింగ్' కాంబో మరోసారి అనగానే అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తవగా, సెట్స్‌పైకి వెళ్లేందుకు చాలా ఇంకా సమయం పట్టేలా కనిపిస్తోంది. ఈనెలలోనే షూటింగ్ మొదలుపెట్టాలనుకున్నారు కానీ కొవిడ్ వల్ల అది కాస్త ఆలస్యమవుతోంది. దీంతో వచ్చే ఏడాదే.. ఈ ప్రాజెక్టు సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం.
ఇప్పటివరకు కనిపించని పాత్రలో ఈ సినిమాలో పవన్ చేయనున్నారు. 'సంచారి' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, దేవి శ్రీప్రసాద్ సంగీతమందిస్తున్నారు.
ఇవీ చదవండి: