ప్రముఖ మలయాళ కథానాయకుడు మోహన్ లాల్ హీరోగా నటిస్తోన్న చిత్రం 'మరక్కార్'. ప్రియదర్శన్ దర్శకుడు. ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై నిర్మితమవుతోంది. తాజాగా టాలీవుడ్ ప్రముఖ కథానాయకుడు చిరంజీవి, రామ్ చరణ్ ఈ సినిమా ప్రచార చిత్రం విడుదల చేశారు.
"దీన్ని కుంజాలీ మీకు ఇవ్వమని చెప్పారు" అనే సంబాషణతో ప్రారంభమయ్యే ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తి రేకెత్తిస్తోంది. నేపథ్య సంగీతం ప్రధానంగా నిలుస్తోంది. కేరళ ప్రాంతపు పదహారవ శతాబ్దానికి చెందిన యోధుడు కుంజాలి మరక్కర్ జీవితాధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ప్రణవ్ మోహన్‌లాల్, అర్జున్, సునీల్ శెట్టి, ప్రభు, మంజు వారియర్, సుహాసిని, కీర్తి సురేష్, కల్యాణి ప్రియదర్శన్ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. 2020 మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">