మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ 'దృశ్యం' సినిమా అరుదైన రికార్డు సాధించింది. యూకె, యూఎస్‌లో రూ.కోటి గ్రాస్ కలెక్షన్ వసూలు చేసిన తొలి మలయాళ చిత్రంగా నిలిచింది. అంతేకాకుండా విడుదలైన 26 రోజుల్లోనే పది వేల షోస్ నడిచిన తొలి మలయాళ చిత్రంగా కూడా ఘనతను అందుకుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఈ చిత్రానికి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. 2013లో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. తెలుగు, కన్నడ, తమిళ భాషల్లోనూ ఆయా సినీ పరిశ్రమల అగ్ర నటులతో అదే పేరుతో ప్రేక్షకుల ముందుకొచ్చి ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఓ మధ్య తరగతి కుటుంబ నేపథ్యంలో సాగే కథ ఇది. కూతురు సమస్యల్లో ఉందని తెలిసి తనను రక్షించడానికి ఆ కుటుంబ సభ్యులు ఏం చేశారనేది కథాంశం. త్వరలోనే ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతోన్న 'దృశ్యం 2' ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదీ చూడండి : 'దృశ్యం 2' షూటింగ్ ప్రారంభం.. కానీ ఒక్క షరతు!