మోహన్‌బాబు (Mohan Babu) కథానాయకుడిగా నటిస్తున్న 'సన్ ఆఫ్ ఇండియా' (Son Of India) సినిమా సందడి షురూ కానుంది. ఈ నెల 4న టీజర్‌ని విడుదల చేయనున్నారు. మోహన్‌బాబు కథానాయకుడిగా నటించిన 'అసెంబ్లీ రౌడీ' విడుదలైన రోజు అది. 30 ఏళ్ల కిందట విడుదలైన ఆ చిత్రం ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీసు రికార్డుల్ని తిరగరాసింది. అందులో మోహన్‌బాబు చెప్పిన సంభాషణలు ప్రేక్షకుల్ని అలరించాయి. ఆ ప్రత్యేకత వల్లే ఈ నెల 4న 'సన్ ఆఫ్ ఇండియా' (Son Of India Teaser) టీజర్‌ని విడుదల చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై విష్ణు మంచు నిర్మిస్తున్నారు. వాస్తవిక సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకొంటోంది. మోహన్‌బాబు ఇమేజ్‌కి తగ్గ అంశాలతోపాటు.. ఆయన శైలి సంభాషణలు, యాక్షన్, భావోద్వేగాలతో చిత్రాన్ని రూపొందిస్తున్నారు.