బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నటించిన పీఎం నరేంద్ర మోదీ బయోపిక్‌ను గతంలో ఏప్రిల్ 5న విడుదల చేస్తామని ప్రకటించింది చిత్రబృందం. అయితే ఏప్రిల్ 11 నుంచి ఎన్నికలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో...ఈచిత్రం ఓటర్లనుప్రభావితం చేసే అవకాశముందని కాంగ్రెస్ సహా కొన్ని ప్రతిపక్ష పార్టీలుఆందోళన వ్యక్తం చేశాయి. ఇప్పటికే రెండు హైకోర్టులు చిత్రం విడుదలను ఆపలేమని చెప్పడంతో చివరకు సుప్రీంని ఆశ్రయించారు పిటిషనర్లు. అయితే కోర్టు తదుపరి ఆదేశాల వరకుచిత్రం విడుదల చేయమని వెల్లడించారు నిర్మాత సందీప్ సింగ్.
'ఏప్రిల్ 5న పీఎం నరేంద్రమోదీ బయోపిక్ విడుదల చేయట్లేదు. దీనిపై మరిన్ని వివరాలు తర్వాత ప్రకటిస్తాం'.
- నిర్మాత , సందీప్ ఎస్ సింగ్
'నరేంద్ర మోదీ' సినిమా విడుదలను వాయిదా వేయాలన్న కాంగ్రెస్ పిటిషన్‌పై విచారణకు అనుమతించింది సుప్రీంకోర్టు. ఈ నెల 8న న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఏ.బోబ్డె నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశాన్ని పరిశీలించనుంది.