ETV Bharat / sitara

వెబ్​సిరీస్​పై వ్యతిరేకత.. 'మీర్జాపూర్' అసలు​ కథేంటి?

'మీర్జాపూర్​-2' వెబ్​సిరీస్​ ప్రజల్లో విపరీతమైన జనాదరణ దక్కించుకుంది. కానీ, ఉత్తరప్రదేశ్​లోని మీర్జాపూర్​లో మాత్రం దీనిపై పూర్తి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చారిత్రాత్మక నేపథ్యం కలిగి, పర్యాటక, ఆహ్లాదకరమైన ప్రాంతాన్ని నేరపూరిత కథాంశంతో తప్పుగా చూపించారనేది అక్కడి ప్రజల వాదన. మరి ఈ ఊరి అసలు కథేంటి?

Mirzapur 2: Mirzapur is really different in real life
వెబ్​సిరీస్​పై వ్యతిరేకత.. 'మీర్జాపూర్' అసలు​ కథేంటి?
author img

By

Published : Nov 1, 2020, 5:06 PM IST

'మీర్జాపూర్' అనే పేరు వినగానే అమెజాన్ ప్రైమ్​లో వచ్చే వెబ్​సిరీస్​ గుర్తొస్తుంది. గ్యాంగ్​స్టర్​ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్​.. విశేషాదరణ దక్కించుకుంది. కానీ ఈ మధ్యకాలంలో దీనిపై చాలా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. తమ ప్రాంతాన్ని ఉన్నదాని కంటే విరుద్ధంగా చూపించారని, వెంటనే ఆ సిరీస్​ను నిషేధించాలని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే 'మీర్జాపూర్' ప్రాంతానికున్న ప్రత్యేకతల గురించే ఈ కథనం.

ఉత్తరప్రదేశ్​లోని పూర్వాంచల్ ప్రాంతంలోని ఓ జిల్లా మీర్జాపూర్. శివుని వారణాశి లాగా, మీర్జాపూర్ వింధ్యచల్ ధామ్​గా ప్రసిద్ధి చెందింది. ప్రసిద్ధ వింధ్యవాసిని తల్లి ఆలయం ఇక్కడ ఉంది. లక్షలాది మంది భక్తులు ప్రతిఏటా ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఈ నగరమంతా సహజ సౌందర్యంతో నిండి ఉంది. ఇది ప్రజలకు విశ్వాసం, శాంతిని కలిగిస్తుంది. ఇలాంటి ప్రాంతాన్ని క్రిమినల్​ నేపథ్యంలో ఎందుకు చిత్రీకరించారనే దానిపై అక్కడి ప్రజలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇలాంటి చర్యల వల్ల మీర్జాపూర్​ అంటే ప్రజలు భయపడుతున్నారని స్థానికులు అంటున్నారు.

"మీర్జాపూర్​ వెబ్​సిరీస్​కు మా ప్రాంతానికి ఎలాంటి సంబంధం లేదు. అది పూర్తి కల్పిత కథ. ఈ ప్రదేశం దేశంలో పర్యటకానికి, విశ్వాసానికి కేంద్రం. వెబ్​సిరీస్​లో నేరాలు జరుగుతున్నట్లుగా చూపించారు. ఇది సరైనది కాదు. దీని వల్ల మీర్జాపూర్​పై ప్రతికూల సందేశం బయటకు వెళ్తుంది. దీన్ని వెంటనే ఆపాలి" అని స్థానికుడు ఆయుష్​ అన్నారు.

భారత్​ కాలాన్ని నిర్ణయించే ప్రాంతం

భారతదేశపు అంతర్జాతీయ ప్రామాణిక సమయం (IST) జోన్​ మీర్జాపూర్​ నుంచి కూడా నిర్ణయిస్తారు. ఈ ప్రదేశం ఎర్రరాయికి ప్రసిద్ధి చెందింది. పురాతన కాలంలో, ఈ రాయిని మౌర్య రాజవంశం రాజు అశోక చక్రవర్తి బౌద్ధ స్థూపాన్ని తయారు చేయడంలో ఉపయోగించారని.. ప్రస్తుతం భారతదేశ జాతీయ చిహ్నంగా ఉన్న అశోక స్తంభాన్ని దీనితోనే రూపొందిచారు.

"తల్లి వింధ్యవాసిని దర్శనానికి ప్రతి ఏడాది భారతదేశంలో నలుమూలతో పాటు విదేశాల నుంచి ప్రజలు మీర్జాపూర్​కు వెళ్తారు. దీన్ని ప్రముఖంగా చూపించాలి. భారతదేశ ప్రామాణిక సమయాన్ని వింధ్యచల్​ ప్రదేశం ద్వారా నిర్ణయిస్తారు. మీర్జాపూర్​ చాలా ప్రశాంతమైన జిల్లా. గంగా-జమున సంస్కృతి ఇక్కడ చాలా బలంగా ఉంది. ఈ ప్రాంతంలో హిందూ-ముస్లిం అల్లర్లు ఎప్పడూ జరగలేదు. మీర్జాపూర్​ ప్రజలను కించపరిచే విధంగా ఏమైనా చిత్రీకరిస్తే దాన్ని తీవ్రంగా ఖండించాలి" అని క్రైమ్​ మాజీ డీజీసీ రమేంద్ర కుమార్​ శుక్లా అన్నారు.

మీర్జాపూర్​కు అందాన్నిచ్చే ప్రాంతాలు

మీర్జాపూర్​ చుట్టూ వింధ్యచల్​, అరవల్లి, నీలగిరి పర్వతాలు ఉన్నాయి. దీన్ని వింధ్య ప్రాంతం అంటారు. నగరంలో చునార్ కోట చాలా ప్రసిద్ధి చెందింది. ఇవే కాకుండా సీతాకుండ్, లాల్ భైరవ్ ఆలయం, మోతీ చెరువు, తాండా, విండ్‌హామ్, ఖరంజా జలపాతాలు.. లఖానియాకు దారి, చునాదరి, సిర్సి ఆనకట్ట, బకారియా జలపాతం, తారకేశ్వర్ మహాదేవ్, మహాత్రికాన్ శివపూర్, గురుగువూర్, రామేశ్వర్, దేవ్రాహా బాబా ఆశ్రమంతో పాటు మొదలైనవి ప్రసిద్ధి చెందాయి మీర్జాపూర్‌కు ఉత్తరాన వారణాసి, దక్షిణాన సోన్‌భద్ర జిల్లా, పశ్చిమాన అలహాబాద్ జిల్లా ఉన్నాయి.

"మీర్జాపూర్ వెబ్​సిరీస్.. ఈ ప్రాంతాన్ని తప్పుగా చూపిస్తోంది. ఇక్కడ అనేక పర్యటక ప్రాంతాలు ఉన్నాయి. ఈ సిరీస్​లో మాత్రం నేరాల సామ్రాజ్యంగా చూపించడం వల్ల ఇక్కడికి ప్రజలు రావడానికి భయపడతారు. పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపరు. మీర్జాపూర్​లో దీన్ని చిత్రీకరించడం విచారకరం" అని స్థానికుడు దుర్గేశ్​ పటేల్​ చెప్పారు.

కళాకారులతో ప్రసిద్ధి చెందింది

సాంస్కృతిక, మత, గంగా-జమున బోన్​హోమీ నగరంగా మీర్జాపూర్​ ఖ్యాతి చెందింది. ఇప్పటివరకు ఎలాంటి మతకల్లోలాలు జరగలేదు. రచయితలు, సంగీతకారులు, కళాకారులు, జర్నలిస్టులు, రాజకీయ నాయకులతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రముఖ సంస్కృత రచయిత పద్మశ్రీ నహీద్​ అబిది, రచయిత లక్ష్మీరాజ్​ శర్మ ఈ ప్రాంతానికి చెందినవారే. తొలి మహిళా గాయకురాలు మనదేవి, పూలన్​దేవీ స్వస్థలం ఇదే.

ఎంపీ అనుప్రియ పటేల్​ ఏమంటున్నారు?

మీర్జాపూర్​ను అభివృద్ధి చేయడంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ అపారంగా కృషి చేస్తున్నారని స్థానిక ఎంపీ అనుప్రియ పటేల్​ ట్వీట్​ చేశారు. సామరస్యానికి కేంద్రంగా ఉన్న ప్రాంతం ఇది అని.. మీర్జాపూర్​-2 వెబ్​సిరీస్​ ద్వారా ఈ ప్రాంతానికి అపకీర్తి వస్తోందని ఆమె చెప్పారు. దీనిపై దర్యాప్తు జరిపి, వెబ్​సిరీస్​కు సంబంధించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

'మీర్జాపూర్ -2' వెబ్​సిరీస్ రెండో సీజన్ అక్టోబర్ 23న విడుదలైంది. పంకజ్ త్రిపాఠి, దివ్యేందు శర్మ, అలీ ఫజల్, శ్వేతా త్రిపాఠి, రసిక దుగ్గల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. గుర్మీత్ సింగ్, మిహిర్ దేశాయ్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ విడుదల తర్వాత సోషల్ మీడియాలో సిరీస్​పై బాగా వ్యతిరేకత వచ్చింది. మీర్జాపూర్​ ప్రజలు తమ అసంతృప్తిని కూడా వ్యక్తం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.