కొరియన్ చిత్రం 'మిడ్ నైట్ రన్నర్స్' ఆధారంగా తెలుగులో ఓ సినిమా రూపొందుతోంది. రెజీనా, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది.ఈ చిత్రానికి 'శాకినీ- ఢాకినీ' అనే టైటిల్ ఖరారైనట్లు సినీ వర్గాల సమాచారం.
యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందనున్న చిత్రానికి దగ్గుబాటి సురేశ్ బాబు, సునీత తాటి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో ఇద్దరు నాయికల పాత్రలు చాలా వైవిధ్యంగా ఉంటాయని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది ద్వితియార్థంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఇదీ చూడండి: సాక్షి అగర్వాల్.. నీ అందం జిగేల్ జిగేల్!