ETV Bharat / sitara

మెహరీన్‌కు పెళ్లంట.. మార్చి 13న నిశ్చితార్థం! - mehreen

పాలబుగ్గల సుందరి మెహరీన్ పెళ్లి పీటలెక్కబోతోందని సమాచారం. 'కృష్ణగాడి వీర ప్రేమగాథ', 'ఎఫ్‌2' చిత్రాలతో అభిమానులను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ వివాహం మార్చి 13న జరగనున్నట్లు తెలుస్తోంది.

mehreen to get engaged to a politician
మెహరీన్‌కు పెళ్లంట.. మార్చి 13న నిశ్చితార్థం!
author img

By

Published : Feb 13, 2021, 11:04 PM IST

'హనీ ఈజ్‌ గ్రేట్‌' అంటూ 'ఎఫ్‌2'లో నవ్వులు పూయించిన నటి‌ మెహరీన్‌ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు! హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ భిష్ణోయ్‌ మనుమడు భవ్య బిష్ణోయ్‌తో ఈ ముద్దుగుమ్మకు వివాహం కుదిరినట్టు సమాచారం. పెళ్లి కొడుకు తండ్రి కుల్దీప్‌ బిష్ణోయ్‌ కూడా అదంపూర్ ఎమ్మెల్యేగా ఉన్నారు.

రాజస్థాన్‌లోని జైపూర్‌ అలీలా కోటలో మార్చి 13న వీరిద్దరి నిశ్చితార్థ వేడుక జరగనున్నట్టు తెలుస్తోంది. 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' చిత్రంతో తెలుగు తెరకు పరియమైన మెహరీన్‌.. తెలుగు, తమిళ భాషల్లో కలిపి మొత్తంగా 26 సినిమాల్లో నటించారు. టాలీవుడ్‌లో ఆమె నటించిన సినిమాల్లో చాలా వరకూ విజయాలు సాధించాయి. ప్రస్తుతం 'ఎఫ్‌2'కు కొనసాగింపుగా డైరెక్టర్‌ అనిల్‌రావిపూడి తెరకెక్కిస్తున్న 'ఎఫ్‌3'లోనూ ఆమె నటిస్తున్నారు.

ఇదీ చూడండి: విష్ణుప్రియ సెగలు.. ల్యాండ్‌ అయిన లైగర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.