ETV Bharat / sitara

'కొత్తవాళ్లు వైవిధ్యంగా చేస్తే చూసి మురిసిపోతుంటా' - రాజావిక్రమార్క చిత్రం వార్తలు

కార్తికేయ హీరోగా నటించిన 'రాజా విక్రమార్క'(karthikeya raja vikramarka) చిత్రానికి మెగాస్టార్​ చిరంజీవి బెస్ట్‌ విషెస్‌ తెలిపారు. యువ నటీనటులు ఏమాత్రం వైవిధ్యంగా చేసినా.. దాన్ని చూసి మురిసిపోవడం, వాళ్లని ప్రోత్సహించడం తనకున్న బలమైన బలహీనతన్నారు.

chiranjeevi
చిరంజీవి
author img

By

Published : Nov 12, 2021, 2:20 PM IST

సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్న కొత్తవాళ్లు ఏమాత్రం వైవిధ్యంగా చేసినా.. దాన్ని చూసి మురిసిపోవడం, వాళ్లని ప్రోత్సహించడం తనకున్న బలమైన బలహీనత అని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. కార్తికేయ హీరోగా నటించిన 'రాజా విక్రమార్క' చిత్రానికి చిరు బెస్ట్‌ విషెస్‌ తెలిపారు. సినిమా విజయం సాధించాలని కోరుకున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన 'రాజా విక్రమార్క'(karthikeya raja vikramarka) చిత్రాన్ని ప్రతిఒక్కరూ ఆదరించాలని కోరుకున్నారు.

  • What better can happen when the night before your movie releases @KChiruTweets sir himself sends you his best wishes 😍
    Thank you is a small word sir 🙏🏼
    Starting from tomorrow I promise to deliver the best work possible and make myself worthy of MEGASTAR speaking about me . pic.twitter.com/rF3AC0M3uk

    — Kartikeya (@ActorKartikeya) November 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఎవరి అండదండలు లేకుండా స్వయంకృషితో ఎదిగిన వాళ్లంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే, సినిమా అనే ఈ రంగుల ప్రపంచంలో నేను కూడా ఎదిగింది.. ఆ స్వయంకృషి అనే తారకమంత్రంతోనే. ప్రస్తుతం స్వయంకృషితో కెరీర్‌లో ఎదుగుతున్న యంగ్‌ హీరో కార్తికేయ. నా అభిమాని. నాక్కూడా అతని పట్ల ఓ సోదరభావం ఉంది. నాకు చాలా ఇష్టమైన నా సినిమా 'రాజా విక్రమార్క'(karthikeya raja vikramarka). అదే టైటిల్‌తో ఇప్పుడు అతను ఓ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చేశారు. ఆ సినిమా ట్రైలర్‌, సాంగ్స్‌ చూశాను. చాలా బాగున్నాయి. యువతరం ఏమాత్రం కొత్తగా, ఏమాత్రం వైవిధ్యంగా చేసినా ముచ్చటపడిపోవడం, మురిసిపోవడం, ప్రోత్సహించడం నాకున్న బలమైన బలహీనత. కార్తికేయ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అని చిరు పేర్కొన్నారు.

దీనికి సంబంధించిన వీడియోని కార్తికేయ ట్వీట్‌ చేస్తూ.. ఇకపై తాను మరింత కష్టపడి మంచి సినిమాలు చేస్తానని అన్నారు.

కార్తికేయ(karthikeya raja vikramarka) హీరోగా సరిపల్లి తెరకెక్కించిన యాక్షన్‌ చిత్రం 'రాజా విక్రమార్క'(karthikeya raja vikramarka) చిత్రం నవంబరు 12(శుక్రవారం)న(raja vikramarka movie release date) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆదిరెడ్డి, రామారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. తాన్య రవిచంద్రన్‌ కథానాయిక. సాయికుమార్‌, తనికెళ్ల భరణి, సుధాకర్‌ కోమాకుల కీలక పాత్రలు పోషించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: వెంకీ ​'దృశ్యం 2' రిలీజ్ డేట్ వచ్చేసింది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.