ETV Bharat / sitara

జర్నలిస్టు వైద్యం కోసం మెగాస్టార్​ సాయం - జర్నలిస్టు వైద్యానికి చిరు సాయం

మెగాస్టార్​ చిరంజీవి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న జర్నలిస్టు రామ్మోహన్​ నాయుడును ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా అతడికి మెరుగైన వైద్యం చేయిస్తానని చిరు హామీ ఇచ్చారు.

Megastar chiranjeevi meets senior jounrnalist rammohan naidu
జర్నలిస్టు వైద్యం కోసం మెగాస్టార్​ సాయం
author img

By

Published : Dec 6, 2020, 8:59 PM IST

టాలీవుడ్​ అగ్రకథానాయకుడు చిరంజీవి మరోసారి తన ఉదారతను చాటుకున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్​ పాత్రికేయులు రామ్మోహన్ నాయుడును.. ఆదివారం మెగాస్టార్​ చిరంజీవి పరామర్శించారు. అనారోగ్యంతో బాధపడుతున్న రామ్మోహన్​కు మెరుగైన వైద్య చికిత్స కోసం తగిన ఏర్పాట్లు చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

Megastar chiranjeevi meets senior jounrnalist rammohan naidu
పాత్రికేయులు రామ్మోహన్ నాయుడును పరామర్శిస్తున్న చిరంజీవి

మూడు నెలలుగా జర్నలిస్టు రామ్మోహన్ అనారోగ్యంతో బాధపడుతున్నారనే వార్త తెలుసుకున్న చిరు స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు. హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో మెరుగైన వైద్యం చేయిస్తానని చిరంజీవి ఈ సందర్భంగా హామీ ఇవ్వడం వల్ల పాత్రికేయుని కుటుంబం ఆనందాన్ని వ్యక్తం చేసింది. రామ్మోహన్​ లాంటి జర్నలిస్టులకు అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చిరు ఆకాంక్షించారు. చిరంజీవి ప్రస్తుతం 'ఆచార్య' చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.

రామ్మోహన్​కు చిరు భరోసా

రామ్మోహన్​ కుటుంబసభ్యులతో మాట్లాడుతున్న చిరంజీవి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.