ETV Bharat / sitara

మాది గురుశిష్యుల సంబంధం: చిరు

రచయిత, నాటక రచయిత, జర్నలిస్టుగా పేరుగాంచిన గొల్లపూడి మారుతీరావు గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలిపారు. తమ మధ్య ఉన్నది గురుశిష్య సంబంధమని అన్నారు.

gollapudi
గొల్లపూడి
author img

By

Published : Dec 12, 2019, 7:39 PM IST

గొల్లపూడి మారుతీరావుతో తనకున్నది గురుశిష్య సంబంధమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆయన మరణం పై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

"ఆ మధ్య తన కుమారుడి పేరున నిర్వహించే గొల్లపూడి శ్రీనివాస్ అవార్డు కార్యక్రమానికి నేను వెళ్లా. తర్వాత మళ్లీ నేను ఆయన్ని కలిసే అవకాశం దొరకలేదు. ఆరోగ్యంగా ఉండేవారు. ఇంతలో ఇలా అవుతుందని ఊహించలేదు. ఆయనకి నాకూ చాలా అవినాభావ సంబంధం ఉంది. గురు శిష్యుల్లాంటి సంబంధం. నేను 1979లో 'ఐ లవ్‌ యూ' అనే సినిమా చేసినప్పుడు, ఆ సినిమా ప్రొడ్యూసర్ భావన్నారాయణగారు నాకు గొల్లపూడి మారుతీరావుగారిని పరిచయం చేశారు. అప్పటికే ఆయన చాలా పెద్ద రచయిత, నాటక రచయిత, జర్నలిస్టుగా కూడా పనిచేశారు. సాహిత్య పరంగా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తి, విద్యాధికుడు. ఆయన దగ్గర డైలాగ్స్ నేర్చుకో అని నన్ను పంపించారు. డైలాగులు ఎలా పలకాలో ఆయన వద్ద క్లాస్‌లు తీసుకున్నా. అప్పుడే మా పరిచయం స్నేహంగా మారింది."

gollapudi
గొల్లపూడితో చిరంజీవి

"ఖాళీ ఉన్నప్పుడల్లా నేను టి.నగర్‌లో వాళ్లింటికి వెళ్తుండేవాడిని. ఆయన నాతో ఎన్నో సాహిత్య పరమైన విషయాలు చెప్పేవారు. తన గతం గురించి, గొప్ప గొప్ప కవులు, రచయితల గురించి చెప్తుంటే చాలా ఆసక్తికరంగా వింటుండేవాడిని. నాకు కూడా సాహిత్యం పట్ల, గొప్ప రచయితల గురించి తెలుసుకునే అవకాశం ఆయన ద్వారానే కలిగింది. 1982లో కోడిరామకృష్ణగారు నాతో 'ఇంట్లో రామయ్య వీధిలో క‌ృష్ణయ్య' సినిమా తీయాలనుకున్నప్పుడు ఆ కథలో ఓ పాత్ర గొల్లపూడి మారుతిరావుగారు వేస్తే బాగుంటుందని అనగానే నాకు కూడా అది మంచి ఛాయిస్ అనిపించింది. ఒకరకమైన శాడిజం భర్త, కామెడీగా ఉండే క్యారెక్టర్ . ఆయన ఆ పాత్రలో ఒదిగిపోయి అద్భుతంగా నటించి అందరి మన్ననలు పొందారు."

"ఆ తర్వాత 'ఆలయ శిఖరం' , 'అభిలాష', 'ఛాలెంజ్' లాంటి వరుసగా ఎన్నో సినిమాలు నాతో కలిసి నటించారు. మేం ఎప్పుడు కలుసుకున్నా గతాన్ని గుర్తు చేసుకుంటూ చాలా ఆప్యాయంగా మాట్లాడేవారు. అలాంటి గొప్ప బహుముఖ ప్రజ్ఞాశాలి, సాహిత్యవేత్త, గొప్ప నటుడు, నాటక రచయిత అయిన గొల్లపూడి మారుతీరావుగారు దూరమవ్వడం అన్నది చాలా బాధాకరం. వారి కుటుంబానికే కాదు, యావత్తు సినీ ప్రపంచానికే తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అన్నారు.

ఇవీ చూడండి.. అప్పుడు గీతతో.. ఇప్పుడు సువర్ణతో

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Kuala Lumpur,- 12 December 2019
1. Michelle Obama and Julia Roberts walking on stage
2. Close of Obama Foundation logo
3. Wide of panel discussion with Roberts and Obama
4. Medium cameraman
5. SOUNDBITE (English) Michelle Obama, Former First Lady of the United States:
"We're still not where we need to be in the United States of America when it comes to race. You know, people thought electing Barack Obama would end racism, ha! That's four hundred years of stuff that was gonna be eliminated because of eight years of this kid from Hawaii? Are you kidding me?"
6. Various of crowd at the event
7. Audience member filming on cellphone
8. SOUNDBITE (English) Julia Roberts, Actress:
"I'm not a great poster (on social media). I think there's some kind of unwritten law that you are supposed to post every day. That will never happen. But it's fun and I have my, I designed it through Instagram the same way anybody can, that the only comments I can get on my feed are from people that I follow."
9. Roberts and Obama onstage
10. Roberts and Obama hugging at the end of the event
11. Close of t-shirt reading "Obama.org"
12. Participants seated at the Girls Opportunity Alliance roundtable event
13. Michelle Obama arriving at the roundtable
14. Various of Michelle Obama and participants during roundtable
STORYLINE:
MICHELLE OBAMA: MORE WORK NEEDED ON RACE IN US
        
Michelle Obama says there's still much work to be done toward ending racism in America.
Speaking at an Obama Foundation event in Kuala Lumpur Thursday, the former first lady said "we're still not where we need to be" when it comes to race.
"People thought electing Barack Obama would end racism, ha!" she said.
Obama and actress Julia Roberts spoke about promoting education for girls with hundreds of young leaders from across the Asia Pacific region.
Roberts responded to a question about not being active on social media. She said she will never be the type to post daily and chooses to only allow comments from people she follows.  
Earlier in the week, Obama and Roberts met students at a school in southern Vietnam to talk about their schoolwork and challenges.
Obama started to work on promoting girls education while her husband was president.
She continues the charitable work through the Obama Foundation, with Girls Opportunity Alliance as one of its initiatives.
Last week, she announced that she would donate $500,000 from the sale of her book "Becoming," to the initiative's fund.
Obama and her husband former President Barack Obama will also visit Singapore during their Asia visit.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.