ETV Bharat / sitara

'మహేశ్​ నా కొడుకు లాంటివాడే.. కానీ!' - రామ్ చరణ్​ న్యూస్​

'ఆచార్య' సినిమాలో మహేశ్​బాబు నటిస్తాడన్న ప్రచారాన్ని మెగాస్టార్​ చిరంజీవి కొట్టిపారేశాడు. ఈ సినిమాలో కీలకపాత్ర కోసం రామ్​చరణ్​ను అనుకున్నారని.. మహేశ్​ను ఇప్పటివరకు సంప్రదించలేదని అతడు స్పష్టం చేశాడు.

Mega Star Chiranjeevi REACTS to Mahesh Babu opting out of Acharya
'మహేశ్​బాబు నా కొడుకు లాంటివాడే.. కానీ!'
author img

By

Published : Apr 5, 2020, 7:05 PM IST

మెగాస్టార్​ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య'(వర్కింగ్​ టైటిల్​) తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఓ కీలకపాత్ర కోసం రామ్​చరణ్​ను సంప్రదించారట. కానీ, అతడు రాజమౌళి చిత్రంతో బిజీగా ఉండటం వల్ల ఇందులో పాల్గొనటం లేదని తెలుస్తోంది. అయితే ఈ పాత్రలో మహేశ్​బాబును తీసుకున్నట్టు ఇటీవలే టాలీవుడ్​లో ప్రచారం జరిగింది. దీనిపై తాజాగా చిరంజీవి స్పందించాడు.

"కొరటాల శివ సినిమా కోసం మహేశ్​ను సంప్రదించామన్నది అవాస్తవం. ఇందులోకి అతడిని ఎలా తీసుకువచ్చారో అర్థం కావట్లేదు. మహేశ్​ నా కొడుకు లాంటి వాడే.. కానీ, ఈ సినిమా కోసం అతడిని సంప్రదించలేదు. ఆ పాత్రకు రామ్​చరణ్​ కావాలని దర్శకుడు అడిగాడు. 'ఆర్​ఆర్​ఆర్​' చిత్రీకరణలో చరణ్​ బిజీగా ఉండటం వల్ల అది సాధ్యం కాలేదు. ఒకవేళ రాజమౌళి, కొరటాల శివ.. వారిద్దరి మధ్య అవగాహనతో డేట్లు సర్దుబాటు జరిగితే సాధ్యం కావొచ్చు."

-- చిరంజీవి, కథానాయకుడు

Mega Star Chiranjeevi REACTS to Mahesh Babu opting out of Acharya
చిరంజీవి, రామ్​చరణ్​

కొన్ని క్రియేటివ్​ కారణాలతో ఇటీవలే ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టు నటి త్రిష ప్రకటించింది. ఆ తర్వాత హీరోయిన్​గా కాజల్​ను తీసుకున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

ఇదీ చూడండి.. మరో పది రోజులు ఓపిక పట్టండి: రేణు దేశాయ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.