ETV Bharat / sitara

త్వరలోనే రామ్​చరణ్​ కొత్త సినిమా అప్​డేట్​! - గౌతమ్​ మేనన్​తో రామ్​చరణ్​ సినిమా

'ఆర్​ఆర్​ఆర్​' సినిమా తర్వాత రామ్​చరణ్ తన కొత్త సినిమాను మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనిపై త్వరలోనే అధికార ప్రకటన రానుంది. చెర్రీ కొత్త చిత్రానికి దర్శకుడిగా.. శంకర్​ లేదా గౌతమ్​ తిన్ననూరి వ్యవహరిస్తారని ప్రచారం జరుగుతోంది.

Mega Powerstar Ram Charan new movie announcement soon
త్వరలోనే రామ్​చరణ్​ కొత్త సినిమా అప్​డేట్​!
author img

By

Published : Feb 10, 2021, 8:33 PM IST

మెగా పవర్​స్టార్ రామ్​చరణ్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన 'ఆర్​ఆర్​ఆర్​' చిత్రంతో పాటు 'ఆచార్య'లోనూ నటిస్తున్నారు. వీటి తర్వాత చేయనున్న చిత్రాల కోసం అనేక మంది దర్శకులతో చెర్రీ చర్చలు జరుపుతున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే రానుంది. దీంతో ఈ టాపిక్ ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్​గా మారింది.

ఈ చిత్రాన్ని కోలీవుడ్​ దర్శకుడు శంకర్​ తెరకెక్కిస్తారని కొందరు చెబుతుండగా.. మరికొందరు గౌతమ్​ తిన్ననూరి​ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇటీవలే శంకర్​ చెప్పిన కథకు చెర్రీ ఓకే చెప్పారని టాలీవుడ్​లో ప్రచారం జరిగింది. దానికి దిల్​రాజ్​ నిర్మాతగా వ్యవహరిస్తున్నారని సమాచారం. అయితే దీనిపై పూర్తి స్పష్టత రావాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.

ఇదీ చూడండి: సినిమాలే కాదు దైవభక్తీ ముఖ్యమే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.