సినీ రంగంలో రాణించాలనుకునే యువత అడ్డదారులు వెతుక్కోవద్దని ప్రముఖ సినీనటుడు బ్రహ్మాజీ విజ్ఞప్తి చేశారు. ఆలస్యమైనా ఓపికతో ప్రయత్నించాలని సూచించారు. ప్రముఖ నటుడు ఉత్తేజ్ నిర్వహిస్తున్న మయూఖ ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్లో శిక్షణ పొందుతున్న యువతను ప్రోత్సహిస్తూ తన అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయని పేర్కొన్న బ్రహ్మాజీ.. వాటికి అనుగుణంగా నటీనటులు తయారుకావాలని కోరారు.
మయూఖ శిక్షణ కేంద్రం నుంచి ఇప్పటి వరకు 60 మంది విద్యార్థులను నటీనటులుగా తయారు చేసినట్లు స్పష్టం చేశారు ఉత్తేజ్. 40 మంది విద్యార్థులు వివిధ రకాల సినిమాలు, వెబ్ సిరీస్లో నటిస్తున్నట్లు తెలిపారు. తమ కేంద్రం నుంచి వెళ్లే యువత సినీ పరిశ్రమకు అనుకూలంగా ఉండే విధంగా తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి : 'బ్రహ్మాజీ కొడుకని హీరోయిజం చూపించాడు'