అతినిద్ర వల్ల ఓ డెలివరీ బాయ్.. తన జీవితంలో ఎదుర్కొన్న పరిణామాలేంటో తెలియాలంటే 'మత్తు వదలరా' సినిమా చూడాల్సిందే. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి రెండో కుమారుడు శ్రీసింహా హీరోగా నటిస్తున్నాడు. పెద్ద కొడుకు కాల భైరవ సంగీతమందిస్తున్నాడు. నూతన నటీనటులు ఎక్కువగా ఈ చిత్రంలో నటించారు. రితేశ్ రానా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. గతంలో ఎన్టీఆర్ ఫస్ట్‌లుక్‌ను, రామ్‌చరణ్ టీజర్.. ఇప్పుడు రానా ట్రైలర్‌ను విడుదల చేశాడు.
ఇందులో హీరోయిన్గా అతుల్య చంద్ర నటించింది. వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ, సత్య తదితరులు ఇతర పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.
- " class="align-text-top noRightClick twitterSection" data="">