'మన్మథుడు'.. ఈ సినిమా వచ్చి దాదాపు 17 ఏళ్లయింది. కానీ ఇప్పటికీ ఆ చిత్రానికున్న ఆదరణ వేరు. దానికి సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు అంటే ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. తాజాగా విడుదలైన 'మన్మథుడు-2' ట్రైలర్ వాటిని నిజం చేస్తూ అభిమానులను అలరిస్తోంది. లిప్‌లాక్‌లు, సెంటిమెంట్, హాస్యం తదితర అంశాలు ఆకట్టుకుంటున్నాయి. స్టైలిష్ లుక్‌లో నాగ్ కనువిందు చేస్తున్నాడు.
నువ్వు పెళ్లి చేసుకోవా అని హీరోయిన్ అంటే.. "ఒక్క పూట భోజనం కోసం నేను వ్యవసాయం చేయను", "నా జీవితం నా కోసమే.. నేను పిల్లల్ని కనను" అంటూ సెటైర్స్ వేశాడు కింగ్ నాగార్జున. ఈ వయసులోనూ యువహీరోల్లా లిప్‌లాక్‌లు పెడుతూ అంచనాల్ని పెంచేస్తున్నాడు.
కుటుంబ కథ నేపథ్యంలో సినిమాను తీసినట్లు తెలుస్తోంది. మొదటి చిత్రం 'చి.ల.సౌ'తో ఆకట్టుకున్న రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది చదవండి: అమెరికాలో ఓ బేబీకి మిలియన్ డాలర్ల వసూళ్లు