తమిళ ప్రముఖ నవల 'పొన్నియిన్ సెల్వన్' ఆధారంగా మణిరత్నం ఓ సినిమా తీస్తున్నాడు. ఎంతో మందికి సినీ దిగ్గజాలకు కలల చిత్రంగా మిగిలిపోయిన ఈ చిత్నాన్ని ఈ అగ్రదర్శకుడు తెరకెక్కిస్తుండటం వల్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ మూవీకి సంబంధించిన ప్రకటన వచ్చినప్పటి నుంచి ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి.
విక్రమ్, కార్తీ, జయం రవి, విక్రమ్ ప్రభు, రహమాన్, ఐశ్వర్యా రాయ్, ఐశ్వర్యా లక్ష్మి, శరత్‌కుమార్, ప్రభు, జయరామ్, అశ్విన్, కిశోర్ వంటి భారీ తారాగణంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరగుతున్నాయి. మరోపక్క బ్యాంకాక్‌లో ఈ మూవీ చిత్రీకరణ మొదలైంది.
లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిరత్నం సారథ్యంలోని మెడ్రాస్ టాకీస్ కూడా నిర్మిస్తోంది. కుమరవేల్‌తో కలిసి స్క్రీన్‌ప్లే సమకూర్చాడు మణిరత్నం. మాటలు జయమోహన్ రాశాడు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం దర్శకుడు. రవివర్మన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.