ETV Bharat / sitara

'మోసగాళ్లు' విడుదల తేదీ వచ్చేసింది - మోసగాళ్లు

ప్రపంచంలో అతిపెద్ద ఐటీ కుంభకోణం కథాంశంతో 'మోసగాళ్లు' చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాకు మంచు విష్ణు హీరోగా, నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. కాజల్​ హీరోయిన్. దీనికి సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తవ్వడం వల్ల విడుదల తేదీని తాజాగా ప్రకటించింది చిత్రబృందం.

manchu vishnu's new movie mosagaallu will release on june 5th
'మోసగాళ్లు' అప్పుడే వస్తారు..!
author img

By

Published : Apr 5, 2020, 3:35 PM IST

మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం 'మోసగాళ్లు'. కాజల్‌ కథానాయిక. సునీల్‌శెట్టి కీలక పాత్ర పోషిస్తున్నాడు. జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు, ఆంగ్ల భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది. తెలుగు చిత్రాన్ని జూన్‌ 5న, ఆంగ్ల చిత్రాన్ని జులైలోనూ విడుదల చేయనున్నట్లు మంచు విష్ణు ప్రకటించాడు.

manchu vishnu's new movie mosagaallu will release on june 5th
సునీల్​ శెట్టి

ప్రపంచంలోనే అతి పెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. భారీ వ్యయంతో హైదరాబాద్‌లో ఓ ఐటీ ఆఫీస్‌ సెట్‌ను నిర్మించారు. అందులో చిత్రీకరణ జరుగుతుండగా, కరోనా ప్రభావంతో ఆపేశారు. దాదాపు చిత్రీకరణ పూర్తయిందని అందుకే విడుదల తేదీని ఖరారు చేశామని మంచు విష్ణు తెలిపాడు. ఇందులో అర్జున్‌గా మంచు విష్ణు.. అను పాత్రలో కాజల్‌, ఏసీపీ కుమార్‌గా సునీల్‌శెట్టి నటిస్తున్నారు. ఈ పాత్రలకు సంబంధించి ఇటీవల విడుదల చేసిన లుక్స్‌ ఆకట్టుకున్నాయి. ఇందులో నవదీప్‌ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు.

ఇదీ చూడండి.. బందీపోటుగా పవన్​.. ప్రత్యేకగీతంలో పూజిత!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.