Film director arrested in rape caseL: అత్యాచార ఆరోపణలతో మలయాళ దర్శకుడు లీజు కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని కొచ్చిలోని న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. ఈ విషయాన్ని సదరు అధికారులు తెలిపారు. ఓ మహిళ ఫిర్యాదు మేరకు లీజును అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
2020 డిసెంబరు 20 నుంచి 2021 జూన్ వరకు కొచ్చిలోని కక్కనాడ్కు చెందిన సదరు మహిళపై.. లీజు పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం అతడు.. 'పడవెట్టు' అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అంతకుముందు ఐమా అనే మూవీని రూపొందించాడు.
ఇదీ చూడండి: This week movies: ఈ వారం రిలీజయ్యే సినిమాలివే!