దివంగత మలయాళ నటుడు రాజన్ పి.దేవ్ కుమారుడు ఉన్నీ దేవ్‌ను కేరళలోని నేదుమంగాడ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. తన భార్య ప్రియాంక ఆత్మహత్య కేసులో భాగంగా విచారించేందుకు ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఉన్ని దేవ్ కూడా అనేక మలయాళ చిత్రాల్లో నటించారు.
ఏం జరిగిందంటే?
ఉన్నీ దేవ్ భార్య ప్రియాంక.. ఈ నెల 12న తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్య చేసుకునే ముందు రోజు తనపై జరుగుతోన్న గృహహింసపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు దాన్ని అనుమానాస్పద మృతి అని కేసు నమోదు చేసుకున్నారు. ప్రియాంక సోదరుని ద్వారా మెట్టినింట ఆమె ఎదుర్కొన్న సమస్యలను పోలీసులు ఆరా తీసి.. విచారణ కోసం ఉన్నీ దేవ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి: 'ఆర్ఆర్ఆర్' డిజిటల్, శాటిలైట్ హక్కులు వీరివే