ETV Bharat / sitara

'విడాకుల విషయంలో మరోసారి ఆలోచించుకోమన్నారు' - మలైకా

బాలీవుడ్ నటి మలైకా అరోరా... నటుడు, నిర్మాత అర్భాజ్​ ఖాన్​తో విడాకుల తీసుకోవడంపై స్పందించింది. ఇటీవలే కరీనా కపూర్​ నిర్వహిస్తున్న చాట్​ షోకు హాజరైన ఈ భామ.. పలు విషయాలు చర్చించింది.

Malaika on divorce with Arbaaz: 'Don't do it,' said my family, night before divorce
ఆ విషయంలో మరోసారి ఆలోచించమన్నారు: మలైకా
author img

By

Published : Apr 3, 2020, 2:42 PM IST

Updated : Apr 4, 2020, 6:34 AM IST

బాలీవుడ్ జోడీ మలైకా అరోరా, అర్బాజ్​ ఖాన్.. 2017లో న్యాయపరంగా విడాకులు తీసుకున్నారు. అయితే ఆ తర్వాత ఈ విషయం గురించి ఇద్దరిలో ఎవరూ మాట్లాడలేదు. కానీ ఇటీవలే కరీనా కపూర్ రేడియో షో 'వాట్ ఉమెన్ వాంట్​'లో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించింది మలైకా. డైవోర్స్ తీసుకునే సమయంలో జరిగిన కొన్ని సంఘటనలను గుర్తుచేసుకుంది. తొలుత తన కుటుంబసభ్యులు.. ఈ విషయంపై మరోసారి ఆలోచించమన్నారని చెప్పింది.

"ఈ విషయంలో ఎవరైనా సరే ముందు వద్దనే చెప్తారు. నాకు అలానే జరిగింది. విడాకులు తీసుకునే ముందురోజు రాత్రి.. నువ్వు ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నావా? అని నా కుటుంబ సభ్యులు అడిగారు. మరోసారి ఆలోచించుకోమని చెప్పారు. నేను అనుకున్నదే చెబితే, వారందరూ నాకు అండగా నిలిచారు. మనం తీసుకోనే ఓ నిర్ణయం మన జీవితాన్ని సులభంగా సాగనివ్వదు. చివరికి కొంతమందితో నిందలు పడాల్సినా పరిస్థితులు తీసుకొస్తుంది. అయితే మన కోసం, చూట్టూ ఉండేవారి కోసం ఇదే సరైనదని భావించే నేను, అర్భాజ్‌ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం"

-- మలైకా అరోరా, నటి

తన కుమారుడి అర్హాన్​ గురించి ప్రస్తావించిన మలైకా.. అతడిని మంచి వాతావరణంలో సంతోషంగా ఉంచేందుకే ప్రాధాన్యాన్ని ఇచ్చామని చెప్పింది. అర్భాజ్​​తో విడిపోయినప్పటికీ తన కొడుకు ఇద్దరితో సంతోషంగా ఉన్నాడని గుర్తుచేసుకుంది.

1998లో మలైకా-అర్భాజ్ పెళ్లి చేసుకున్నారు. 2017 మేలో న్యాయపరంగా విడిపోయారు. ప్రస్తుతం అర్జున్ కపూర్​తో మలైకా డేటింగ్​లో ఉంది. ఇటాలియన్ మోడల్ జార్జియా ఆండ్రియానీతో తన రిలేషన్​షిప్​ను అధికారికంగా ప్రకటించాడు అర్భాజ్.

ఇదీ చదవండి: 'కరోనాను తరిమికొట్టేందుకు సూపర్​హీరో అవుతా'

Last Updated : Apr 4, 2020, 6:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.