ETV Bharat / sitara

మలైకా-అర్జున్​ నిశ్చితార్థం జరిగిందా? - మలైకా అరోరా

బాలీవుడ్​ నటి మలైకా అరోరా, నటుడు అర్జున్ కపూర్​కు నిశ్చితార్థం జరిగిందా? ఇదే విషయమై నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. ఇన్​స్టాలో మలైక చేసిన ఓ పోస్ట్​యే ఇలా మాట్లాడుకోవడానికి కారణం. ఇంతకీ ఏం జరిగిందంటే?

malaika arora
మలైక అరోరా
author img

By

Published : Apr 14, 2021, 4:20 PM IST

Updated : Apr 14, 2021, 4:28 PM IST

బాలీవుడ్ నటి మలైకా అరోరా ఇన్​స్టాలో ఓ కొత్త పోస్ట్​ చేసి అభిమానులందరినీ ఆలోచనల్లో పడేసింది. నెటిజన్లు దీని గురించే తెగ చర్చించుకుంటున్నారు.

అసలేం జరిగిందంటే?

మలైకా.. ఓ డైమండ్​ ఉంగరం ధరించి దిగిన ఫొటోను ఇన్​స్టాలో పోస్ట్​ చేసింది. "ఇలాంటి ఉంగరం ధరించడం నా కల. నేను దీనిని చాలా ఇష్టపడుతున్నాను.. ఆనందం ఇక్కడే మొదలైంది. మీ జీవతంలో ప్రేమను పొందాలంటే ఇలాంటి ఉంగరాన్ని ధరించాలి" అంటూ వ్యాఖ్య జోడించింది.

దీంతో ఆమెకు తన బాయ్​ఫ్రెండ్​ అర్జున్​ కపూర్​తో నిశ్చితార్థం జరిగి ఉంటుందేమోనని అనేక మంది ఊహించుకుంటున్నారు. "హేయ్​, మీకు అర్జున్​కు నిశ్చితార్థం జరిగిందా?', 'మీ ఇద్దరు సంతోషంగా ఉండాలి' అంటూ శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నారు. నిజానికి మలైకా చేసిన ఆ పోస్ట్​.. ఓ జ్యూవెలరీ బ్రాండ్​ ప్రమోషన్​ కోసం ఆమె ఈ ఫొటో దిగారు. ఇది తెలియక నెటిజన్లంతా ఈ విధంగా ఊహించుకుంటున్నారు.

అర్జున్ కపూర్​, హీరోయిన్​ మలైకా అరోరా జోడీ గురించి ఇప్పటికే చాలా పుకార్లు వినిపిస్తున్నాయి. ఇద్దరూ ప్రేమలో ఉన్నారని, సహజీవనం కూడా చేస్తున్నారని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. అయితే తమ బంధంపై ఈ జోడీ ఎలాంటి విషయం ఇప్పటివరకు చెప్పలేదు. మాటల్లో చెప్పకపోయినా.. సోషల్ మీడియా ఖాతాల్లో వీరి పోస్టులు చూసిన వారు.. వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందని చాలారోజులుగా అనుకుంటున్నారు.

ఇదీ చూడండి: 'అతడితో క్వారంటైన్​ అస్సలు బోర్​ కొట్టలేదు'

Last Updated : Apr 14, 2021, 4:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.