మెగా హీరో సాయితేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్.. 'ఉప్పెన' సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు. ఇందులో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. శరవేగంగా చిత్రీకరణ సాగుతోంది. ఈరోజు విజయ్‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను అభిమానులతో పంచుకుంది చిత్రబృందం. రాయనం అనే వ్యక్తిగా కనిపించనున్నాడీ నటుడు.

ఈ చిత్రంలో కీర్తిశెట్టి హీరోయిన్. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.
ఇదీ చదవండి: విలన్ పాత్ర కోసం విజయ్ సేతుపతికి రూ.5 కోట్లు..!