ETV Bharat / sitara

'మోస్ట్​ ఎలిజిబుల్​ బ్యాచ్​లర్​​' వచ్చేది థియేటర్​లోనే! - మోస్ట్​ ఎలిజిబుల్​ బ్యాచ్​లర్​

అఖిల్​ అక్కినేని కొత్త చిత్రం 'మోస్ట్​ ఎలిజిబుల్​ బ్యాచ్​లర్​​' చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయనున్నారని టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది. అయితే సినిమాను థియేటర్లలోనే రిలీజ్​ చేయడానికి చిత్రబృందం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Makers of Akhil's next in no mood to compromise
'మోస్ట్​ ఎలిజిబుల్​ బ్యాచిలర్​' వచ్చేది థియేటర్​లోనే!
author img

By

Published : May 19, 2021, 5:32 AM IST

అక్కినేని అఖిల్​ హీరోగా 'బొమ్మరిల్లు' భాస్కర్​ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'మోస్ట్​ ఎలిజిబుల్​ బ్యాచ్​లర్​'. జూన్​ 19న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ఇటీవలే ప్రకటించింది. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో థియేటర్లు ఇప్పట్లో తెరిచే దాఖలాలు కనిపించడం లేదు. దీంతో ఈ సినిమాను కొనేందుకు పలు డిజిటల్​ వేదికలు పోటీపడుతున్నట్లు సమాచారం.

అయితే ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో థియేటర్లలోనే విడుదల చేయాలని నిర్మాణసంస్థ 'గీతాఆర్ట్స్​ 2' నిర్ణయించినట్లు తెలుస్తోంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్​టైనర్​ కథతో ఈ సినిమాను తీశారు దర్శకుడు 'బొమ్మరిల్లు' భాస్కర్. ఇందులో అఖిల్​ సరసన పూజా హెగ్డే హీరోయిన్​గా నటించింది. గతేడాదే విడుదల కావాల్సిన, కరోనా లాక్​డౌన్ వల్ల అదికాస్త వాయిదా పడింది. ఇప్పుడు జూన్​ 19న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావల్సింది. కానీ, దేశంలో కరోనా రెండోదశ నేపథ్యంలో సినిమా రిలీజ్​ వాయిదా పడే అవకాశం ఉందని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చూడండి.. తాతయ్య కోరిక నెరవేర్చలేకపోయాం: రకుల్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.