ETV Bharat / sitara

'మేజర్'​ టీజర్​ వాయిదా.. 'గల్లీ రౌడీ'గా 'రౌడీ బేబీ'

author img

By

Published : Mar 25, 2021, 5:49 PM IST

అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన 'మేజర్'​ టీజర్​ విడుదల వాయిదా పడింది. సందీప్‌ కిషన్, బాబీసింహా ప్రధానపాత్రల్లో నటిస్తున్న 'రౌడీ బేబీ' చిత్ర టైటిల్​ను 'గల్లీ రౌడీ'గా మార్చారు. ఇంకా పలు చిత్ర విశేషాలు కూడా ఉన్నాయి.

galli rowdy
గల్లీ రౌడీ

సందీప్‌ కిషన్, బాబీ సింహా ప్రధానపాత్రల్లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ముందు ఈ మూవీకి 'రౌడీ బేబి'గా టైటిల్‌ ఖరారు చేశారు. కానీ, కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల ఆ టైటిల్‌ను మార్చి 'గల్లీ రౌడీ'గా ప్రకటించారు. సోషల్‌ మీడియా వేదికగా టైటిల్‌ వీడియోను టాలీవుడ్‌ దర్శకులు పూరీ జగన్నాథ్‌, హరీశ్ ‌శంకర్‌, బాబీ, గోపీచంద్‌ మలినేని, శివ నిర్వాణ విడుదల చేశారు. కోనా ఫిల్మ్‌ కార్పోరేషన్‌, ఎంవీవీ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. నాగేశ్వర్ ‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అభిషేక్‌ బచ్చన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'బిగ్‌బుల్‌'. హర్షద్‌ మెహతా జీవితం ఆధారంగా రూపొందిస్తున్నారు. ఏప్రిల్‌ 8న ఈ చిత్రాన్ని నేరుగా ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదల చేయనున్నారు. తాజాగా ఆ చిత్రంలోని 'ఇష్క్‌ నమాజా' అంటూ సాగుతున్న ఫీల్‌గుడ్‌ రొమాంటిక్ గీతాన్ని విడుదల చేశారు. కున్వార్‌ జునేజా సాహిత్యమందించగా, అంకిత్‌ తివారి ఆలపించారు. గౌరవ్‌దాస్‌ గుప్తా స్వరాలు సమకూర్చారు. నిఖితా దత్తా అభిషేక్‌ భార్యగా నటిస్తుండగా, ఓ ప్రముఖ జర్నలిస్ట్‌ పాత్రలో ఇలియానా నటిస్తోంది. అజయ్‌ దేవ్‌గణ్‌, ఆనంద్‌ పండిత్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి కోకి గులాటి దర్శకత్వం వహిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

26/11 దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తీస్తున్న సినిమా 'మేజర్'. ఈ సినిమాలో అడివి శేష్.. సందీప్ పాత్రలో కనిపించనున్నారు. మార్చి 28న విడుదలవ్వాల్సిన ఈ చిత్ర టీజర్​ వాయిదా వేసినట్లు ప్రకటించింది చిత్రబృందం. ఈ చిత్ర దర్శకుడు శశి కిరణ్​ ఇంట్లో విషాదం చోటు చేసుకోవడం, దేశంలో కరోనా కేసులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించింది. ఈ సినిమాలో శోభిత దూళిపాళ్ల, సయీ మంజ్రేకర్​ కథానాయికలు. సూపర్​స్టార్ మహేశ్​బాబు నిర్మిస్తుండగా, శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది జులై 2న థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

major
మేజర్​
101
101 జిల్లాల అందగాడు
vasantha
వసంత ముల్లాయి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.