ETV Bharat / sitara

ఆస్కార్​ చిత్రంలో మహీంద్రా- నెటిజన్లు ఫిదా - ఆనంద్ మహీంద్రా కేసీఆర్

ఆస్కార్​ అవార్డు పొందిన చిత్రం 'మినారీ'​లో మహీంద్రా ట్రాక్టర్​ కనిపించింది. దీనికి సంబంధించిన ఫొటోను విదేశాంగ శాఖ యూరప్​-వెస్ట్రన్​ వ్యవహారాల జాయింట్​ సెక్రటరీ సందీప్​ చక్రవర్తి ట్విట్టర్​​లో పోస్టు చేశారు. దీంతో ఈ ఫొటోకు విపరీమైన లైక్​లు వచ్చాయి.

Mahindra tractor
మహీంద్రా ట్రాక్టర్​
author img

By

Published : Jun 7, 2021, 7:40 PM IST

మహీంద్రా ట్రాక్టర్స్..​. బహుశా దేశంలో ఈ పేరు తెలియని వారుండరు. భారత్​లోని ప్రతి ఊరిలో ఈ ట్రాక్టర్​ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ పేరు సామాజిక మాధ్యమాల్లో మారుమోగుతోంది. ఎందుకంటారా?

ఇటీవల ఆస్కార్​ అవార్డు సాధించిన మినారీ​ అనే కొరియన్​ మూవీలో ఈ ట్రాక్టర్​ కనిపించింది. దీనికి సంబంధించిన ఫొటోను భారత విదేశాంగ శాఖ యూరప్​-వెస్ట్రన్​ వ్యహారాల జాయింట్​ సెక్రటరీ సందీప్​ చక్రవర్తి ట్విట్టర్​లో పోస్టు చేశారు.

Mahindra tractor
మినారీ'​ చిత్రంలో మహీంద్రా ట్రాక్టర్

"మహీంద్రా కంపెనీ ఛైర్మన్​ ఆనంద్​ మహీంద్రాకు శుభాకాంక్షలు. భారత్ బ్రాండ్లు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినందుకు ఆనందంగా ఉంది#UngoogleableQuiz . ఈ చిత్రం ఆస్కార్​ గెలిచిన మినారీ అనే కొరియన్ సినిమాలోనిది."

-సందీప్​ చక్రవర్తి, భారత విదేశాంగ శాఖ

భారత్​ బ్రాండ్లు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినందుకు ఆనందంగా ఉందని ట్వీట్​ చేశారు సిద్ధార్థ్​ బసు అనే టెలివిజన్​ నిర్మాత.

"మహీంద్రా.. ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న ట్రాక్టర్ బ్రాండ్. మినారీ చిత్రంలో ఈ ట్రాక్టర్​ ఉండడం సంతోషించాల్సిన విషయం. అయితే ఇది యాదృచ్ఛికమా? లేక ఉద్దేశపూర్వకంగా ఉందో తెలియదు."

-సిద్ధార్థ్​ బసు, టెలివిజన్​ నిర్మాత

బసు ట్వీట్‌కు స్పందిస్తూ, మహీంద్రా బోర్డు సభ్యుడి ద్వారా ట్రాక్టర్ ప్రదర్శన గురించి తెలుసుకున్నానని చెప్పారు మహీంద్రా గ్రూప్​ అధిపతి ఆనంద్ మహీంద్రా.

“నాకు happy happenstance అనే పదబంధం ఇష్టం! అమెరికాలో ఉండే బోర్డు సభ్యుడు నాకు ఈ సందేశం పంపారు. దాంతో ఈ విషయం తెలిసింది. మేము 1980లో ఈ ఫొటోలో ఉన్న ట్రాక్టర్​ మోడల్​ కంటే ముందున్న మోడల్స్​ యూఎస్​కు ఎగుమతి చేశాము."

-ఆనంద్​ మహీంద్రా, మహీంద్రా కంపెనీ ఛైర్మన్​

ఇదీ చదవండి: '26/11' ఐకమత్యం భవిష్యత్తులోనూ ఉండాలి: టాటా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.