Maheshbabu penny song: మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా నటిస్తోన్న కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకుడు. ఆదివారం సాయంత్రం ఈసినిమా నుంచి రెండో పాట విడుదలైంది. "ఎవ్రీ పెన్నీ ఎవ్రీ పెన్నీ’’ అంటూ సాగే ఈ పాటకు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు. నకాశ్ అజీజ్ అలపించారు. ప్రతి రూపాయిని అందరూ గౌరవించాలంటూ సాగే ఈ పాట లిరికల్ వీడియోలో తమన్ బృందంతో కలిసి మహేశ్ కుమార్తె సితార స్టెప్పులేశారు. ఈ వీడియోని షేర్ చేసిన మహేశ్.. "పెన్నీ పాట నాకెంతో స్పెషల్. నా రాక్‌స్టార్‌ని చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉంది" అని పేర్కొన్నారు. బ్యాంక్ కుంభకోణం వంటి విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మహేశ్‌బాబు మరింత యంగ్ లుక్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సూపర్‌స్టార్ అభిమానుల్లో అంచనాలు పెంచేశాయి. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Galivana teaser: రాధిక, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘గాలివాన’. శరణ్ కొప్పిశెట్టి దర్శకుడు. సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం జీ5 ఓటీటీ వేదికగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘గాలివాన’ టీజర్‌ను ఆదివారం ఉదయం విడుదలైంది. క్రైమ్ సన్నివేశాలతో ఎంతో ఉత్కంఠగా సాగిన ఈ టీజర్‌లో నటీనటుల మధ్య ఎలాంటి సంభాషణలు చూపించలేదు. కొత్తగా పెళ్లిచేసుకున్న ఓ జంట అనుకోని విధంగా హత్యకు గురి కావడం, దాన్ని ఛేదించే క్రమంలో పోలీసులు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు? ఇంతకీ ఆ జంటను హత్య చేసింది ఎవరు? ఎందుకు హత్య చేశారు? ఇలాంటి ఎన్నో ఆసక్తికర అంశాలతో ఈ సినిమా రూపుదిద్దుకున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
RRR prerelease event: రామ్‌చరణ్, తారక్, రాజమౌళిల ‘ఆర్‌ఆర్‌ఆర్’ ప్రీ రిలీజ్ వేడుక శనివారం సాయంత్రం బెంగళూరులో ఘనంగా జరిగింది. కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజు బొమ్మై ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ కార్యక్రమంలో అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో కోలీవుడ్ స్టార్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ శాండీ మాస్టర్ తన స్టెప్పులతో మెప్పించారు. తారక్, చరణ్, రాజమౌళి కాంబోలో వచ్చిన సినిమాలను థీమ్‌గా తీసుకుని స్టేజ్ దద్దరిల్లేలా స్టెప్పులేశారు. ‘సింహాద్రి’, ‘యమదొంగ’, ‘మగధీర’లోని పవర్‌ఫుల్ డైలాగ్స్‌తోపాటు ‘నాటునాటు’ సాంగ్‌కు స్టెప్పులేసి అందరి దృష్టిని ఆకర్షించారు. అంతేకాకుండా ‘ఆర్‌ఆర్‌ఆర్’ ప్రమోషన్స్‌లో భాగంగా ఏ రాష్ట్రంలో ఈవెంట్ జరిగితే ఆ రాష్ట్ర భాషలో రాజమౌళి అక్కడివారిని పలకరిస్తున్న సంగతి తెలిసిందే. అదే విషయాన్ని శాండీ తన డ్యాన్స్‌తో ఆకట్టుకునేలా చూపించడంతో జక్కన్న నవ్వులు పూయించారు. డ్యాన్స్ పూర్తైన వెంటనే ముఖ్యమంత్రితోపాటు రామ్‌చరణ్, తారక్, రాజమౌళి.. శాండీని అభినందించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: నాన్న సినిమా రీమేక్ చేస్తా.. కానీ ఓ కండీషన్: ఎన్టీఆర్