సూపర్ స్టార్ మహేశ్‌బాబు ఇటీవలే 'మహర్షి'తో హిట్ కొట్టాడు. వంశీ పైడిపల్లి ఆ చిత్రానికి దర్శకత్వం వహించాడు. సినిమా తీస్తున్నప్పుడే వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత ప్రపంచకప్ చూసేందుకు కుటుంబాలతో సహా ఇంగ్లాండ్ వెళ్లారు. ఇప్పుడు వీరి కుమార్తెలు ఇద్దరూ కలిసి సొంతంగా యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించారు.
సితార-ఆద్య పేరుతో ఈ యూట్యూబ్ ఛానెల్‌ను బుధవారం లాంచ్ చేశారు. 'త్రీ మార్కర్ ఛాలెంజ్' పేరుతో తొలి వీడియోను అప్లోడ్ చేశారు. స్కెచ్ పెన్స్ ఆధారంగా ఈ గేమ్ రూపొందించారు. ఆటలో భాగంగా కళ్లకు గంతలు కట్టుకుని బ్యాగ్‌లోని మూడు స్కెచ్‌లు తీసి వాటితో ఓ డ్రాయింగ్‌ను పూర్తి చేయాలి. ఇందులో ఆడుతూ పాడుతూ సందడి చేసిన ఈ చిన్నారులు నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు.
ఇది చదవండి: నీటి ఆదా కోసం దర్శకుడు నాగ్ అశ్విన్.. 'వన్ బకెట్ ఛాలెంజ్'