బుధవారం మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ సందడిగా సాగింది. ఇప్పటి వరకు పనిచేసిన దర్శకులందరి గురించి మాట్లాడాడు హీరో మహేశ్‌బాబు. కానీ పూరి జగన్నాథ్‌ను మర్చిపోయాడు. తర్వాత ట్విట్టర్లో ఈ విషయమై స్పందించాడు.
‘వేడుకలో ముఖ్యమైన వ్యక్తి గురించి చెప్పడం మర్చిపోయా. నా 25 సినిమాల ప్రయాణంలో ‘పోకిరి’ నన్ను సూపర్‌స్టార్‌ను చేసింది. నాకు ‘పోకిరి’లో అవకాశం ఇచ్చినందుకు పూరీ జగన్నాథ్‌కు ధన్యవాదాలు. ఈ సినిమాను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను’ -ట్విట్టర్లో మహేశ్‌బాబు
ట్విట్టర్ మహేశ్‌బాబు, పూరీ జగన్నాథ్‌ల మధ్య ఆసక్తికర సంబాషణ
‘ధన్యవాదాలు సర్. లవ్యూ. ‘మహర్షి’ ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది’ ట్విట్టర్ పూరీ జగన్నాథ్
పూజా హెగ్డే హీరోయిన్గా, అల్లరి నరేశ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు.