ETV Bharat / sitara

అందంలోనైనా.. నటనలోనైనా అతడే నంబర్ 'వన్'

టాలీవుడ్​ హీరో మహేశ్​బాబు.. నేడు(శుక్రవారం) 44వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. తన గ్లామర్​, నటనతో అంతులేనంత మంది అభిమానుల్ని సంపాదించుకున్న ఈ కథానాయకుడిపై స్పెషల్ స్టోరీ.

హీరో మహేశ్​బాబు పుట్టినరోజు ప్రత్యేక కథనం
author img

By

Published : Aug 9, 2019, 5:06 AM IST

'మహేశ్... ఆ పేరులో మత్తుంది, ఆ పేరులో వైబ్రేషన్స్​ ఉన్నాయి'.. ఇది ఒక తెలుగు సినిమాలోని డైలాగ్​ కావొచ్చు, కానీ ఇదొక్కటి చాలు మహేశ్​బాబు క్రేజ్​ ఏంటో చెప్పడానికి. తనదైన మేనరిజం, నటన, డ్యాన్స్​తో ప్రేక్షకుల్ని మెప్పించిన ప్రిన్స్.. ప్రస్తుతం టాలీవుడ్​లో అగ్రహీరోల్లో ఒకడిగా కొనసాగుతున్నాడు. ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లవుతున్నా తన గ్లామర్​తో కుర్రహీరోలకు పోటీ ఇస్తున్నాడు. నేడు 44 వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా సూపర్​స్టార్​పై ప్రత్యేక కథనం.

MAHESH BIRTHDAY SPECIAL
సూపర్​స్టార్ మహేశ్​బాబు ప్రత్యేకం

కుటుంబ నేపథ్యం

సూపర్‌ స్టార్‌ కృష్ణ నాలుగో సంతానం మహేశ్ బాబు. ప్రిన్స్‌కు ఇద్దరు అక్కలు, ఒక అన్నయ్య ఉన్నారు. మహేశ్​కు ప్రియదర్శని అనే చెల్లెలు ఉంది. ఈమె భర్తే నటుడు సుధీర్‌బాబు. అమ్మమ్మ దుర్గమ్మ దగ్గర పెరిగిన ప్రిన్స్​ చదువంతా మద్రాస్​లో సాగింది. అక్కడి లయోలా కాలేజ్‌లో కామర్స్‌ విభాగంలో డిగ్రీ పట్టా పొందాడు.

MAHESH IN ADVERTAISMENT
ఓ వాణిజ్య ప్రకటనలో మహేశ్​బాబు

బాలనటుడిగా అరంగేట్రం

బాల నటుడిగా సినిమాల్లోకి అరంగేట్రం చేశాడు మహేశ్​బాబు. ఆ వయసులోనే తనదైన శైలి నటనతో మెప్పించాడు. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా మొదటి సినిమా ‘నీడ’. ఓ పక్క చదువుకుంటూనే మరోపక్క సినిమాల్లో నటించాడు. ‘పోరాటం’, ‘శంఖారావం’, ‘బజారు రౌడీ’, ‘గూఢచారి 117’, ‘కొడుకు దిద్దిన కాపురం’, ‘బాలచంద్రుడు’ చిత్రాలతో ప్రేక్షకులను కట్టిపడేశాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సినీ ప్రస్థానం

1999లో ‘రాజకుమారుడు’తో హీరోగా తెరంగేట్రం చేశాడు మహేశ్​బాబు. ఆ తర్వాత ‘యువరాజు’, ‘వంశీ’, ‘మురారి’, ‘టక్కరి దొంగ’, ‘బాబీ’, ‘ఒక్కడు’, ‘నిజం’, ‘నాని’, ‘అర్జున్‌’, ‘అతడు’, ‘పోకిరి’, ‘సైనికుడు’, ‘అతిథి’, ‘ఖలేజా’, ‘దూకుడు’, ‘బిజినెస్‌మెన్‌’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘వన్‌ నేనొక్కడినే’, ‘ఆగడు’, ‘శ్రీమంతుడు’, ‘బ్రహ్మోత్సవం’, ‘స్పైడర్‌’, ‘భరత్‌ అనే నేను’, ‘మహర్షి’ సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో బిజీగా ఉన్నాడు.

విభిన్న పాత్రల్లో మెరిసిన ప్రిన్స్

‘శ్రీమంతుడు’గా ఊరిని దత్తత తీసుకోమని సందేశమిచ్చినా, ‘టక్కరి దొంగ’గా అలరించినా, సోదరిని అమితంగా ప్రేమించే ‘అర్జున్‌’గా... ఇలా ప్రతి పాత్రతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడీ ఘట్టమనేని అందగాడు. సీఎం అంటే ఇలా ఉండాలి అనిపించేలా ‘భరత్‌ అనే నేను’ చిత్రంలో భరత్‌ పాత్రలో మహేశ్ అలవోకగా ఒదిగిపోయాడు.

వాణిజ్య ప్రకటనల్లోనూ యువరాజే

సినిమాలతోనే కాదు వాణిజ్య ప్రకటనలతోనూ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు మహేశ్​. వాటికి తోడు ఎన్నో బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరించాడు, వ్యవహరిస్తున్నాడు. ఇటీవలే సొంతంగా బ్రాండెడ్​ దుస్తుల వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చాడు.

అవార్డులు

  1. తొలి సినిమా ‘రాజకుమారుడు’కు ఉత్తమ నూతన నటుడు కేటగిరీలో నంది పురస్కారం.
  2. ‘మురారి’, ‘టక్కరి దొంగ’, ‘అర్జున్‌’ చిత్రాలకు నంది స్పెషల్‌ జ్యూరీ పురస్కారం.
  3. ‘నిజం’, ‘అతడు’, ‘దూకుడు’, ‘శ్రీమంతుడు’ చిత్రాలకు నంది ఉత్తమ నటుడు పురస్కారాలు.

నమ్రతతో వివాహం

‘వంశీ’ సినిమాలో తనతో నటించిన హీరోయిన్‌ నమ్రతనే పెళ్లి చేసుకున్నాడు మహేశ్ బాబు. ఇప్పటికీ టాలీవుడ్‌ స్వీట్‌ కపుల్స్‌ అంటే గుర్తొచ్చేది మహేశ్-నమ్రతా శిరోద్కర్‌ జోడీనే. 2000 సంవత్సరంలో ప్రేమలో పడిన వీరిద్దరూ ఐదేళ్ల పాటు ప్రేమించుకుని, 2005లో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు.

MAHESH BABU WITH FAMILY MEMBERS
కుటుంబ సభ్యులతో మహేశ్​బాబు

వీరికి గౌతమ్, సితార అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికే అధిక ప్రాధాన్యం ఇస్తాడు మహేశ్​బాబు. వీలున్నప్పుడల్లా కుటుంబంతో గడుపుతూ ఎప్పటికప్పుడు తన పిల్లలతో దిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్​ చేస్తుంటాడీ సూపర్​స్టార్​.

ఇవీ చదవండి:

AP Video Delivery Log - 1300 GMT Horizons
Thursday, 8 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 24 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1039: HZ UK Tree Planting AP Clients Only 4224191
22 million trees planted in climate change battle
AP-APTN-1007: HZ World Diet Overhaul AP Clients Only 4191407
Less beef, more beans to save the environment and improve health -
+REPLAY WITH UPDATED SCRIPT AND LEAD IN+
AP-APTN-0910: HZ UK Veganism AP Clients Only 4206462
Veganism is becomming mainstream in UK +REPLAY W/UPDATED LEAD IN +
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.