ETV Bharat / sitara

రియల్ బిజినెస్​మెన్​గా మహేశ్.. వస్త్ర వ్యాపారంలోకి!

సూపర్​ స్టార్ మహేశ్​బాబు.. 'ద హంబుల్​ కో' పేరుతో కొత్తగా బ్రాండెడ్​ దుస్తుల వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. బుధవారం లాంఛనంగా ఆవిష్కరించారు.

మహేశ్​ బ్రాండెడ్​ దుస్తుల వ్యాపారం షురూ
author img

By

Published : Aug 7, 2019, 8:10 PM IST

మహేశ్​ బ్రాండెడ్​ దుస్తుల వ్యాపారం షురూ

హీరోగానే కాకుండా 'బిజినెస్​మేన్​'గా రాణించేందుకు సిద్ధమయ్యాడు టాలీవుడ్​ సూపర్​స్టార్ మహేశ్​బాబు. ఇప్పటికే ఏఎంబీ సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ రంగంలో​ విజయవంతమయ్యాడు. 'ద హంబుల్ కో' పేరుతో బ్రాండెడ్​ దుస్తుల వ్యాపారాన్ని బుధవారం ప్రారంభించాడు. హైదరాబాద్​ పార్క్​ హయత్​ హోటల్​ దీనికి వేదికైంది.

ముందుగా కంపెనీకి సంబంధించిన దుస్తుల్ని ధరించిన మోడళ్లు ర్యాంప్​ వాక్​ చేశారు. అనంతరం అభిమానుల ప్రశ్నలకు సమాధానమిచ్చాడు మహేశ్​. తన పుట్టినరోజుకు రెండు రోజుల ముందు 'ద హంబుల్ కో'ను ఆవిష్కరించడం ఆనందంగా ఉందని చెప్పాడు. ఇది ఓ క్లాతింగ్ బ్రాండ్ మాత్రమే కాదని, ఇదొక జీవనశైలి అని పేర్కొన్నాడు. ఈ దుస్తులు స్పాయిల్​ యాప్​లో లభించనున్నాయి.

ఇది చదవండి: 'సూపర్​స్టార్​ మహేశ్​': 20 ఏళ్లు.. 25 చిత్రాలు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.