సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ప్రస్తుతం విహారంలో ఉన్నాడు. 'సరిలేరు నీకెవ్వరు' విజయాన్ని ఆస్వాదిస్తూ, కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాలో గడుపుతున్నాడు. ఇక్కడ మాత్రం అతడి కొత్త సినిమా కోసం శరవేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించబోతున్నాడు. స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతూనే, కథానాయికల ఎంపికపై దృష్టిపెట్టింది చిత్రబృందం.
ఇందులో మహేశ్ సరసన ఇద్దరు హీరోయిన్లు కనిపించనున్నట్టు తెలుస్తోంది. 'భరత్ అనే నేను'లో మహేశ్‌తో కలిసి నటించిన కియారా అడ్వాణీ పేరు ప్రచారంలోకి వచ్చినా, ఆమె హిందీ చిత్రాలతో తీరిక లేకుండా గడుపుతోంది. మరి మహేశ్ సరసన మెరిసే ఆ ముద్దుగుమ్మలు ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇందులో మహేశ్ గూఢచారిగా కనిపిస్తాడని తెలుస్తోంది. 'మహర్షి' తర్వాత మహేశ్ - వంశీ పైడిపల్లి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రమిది.