'మహేశ్ 27' ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవలే 'సరిలేరు నీకెవ్వరు'తో ఘన విజయం అందుకున్న సూపర్‌స్టార్.. తన తదుపరి చిత్రం వంశీ పైడిపల్లితో చేస్తున్నట్లు ప్రకటించాడు. కానీ, కథలో మార్పులు కావాలని మహేశ్ కోరడం వల్ల ఈ ప్రాజెక్టును తాత్కాలికంగా పక్కన పెట్టారని సమాచారం. కొంతకాలం తర్వాత స్క్రిప్ట్‌లో మార్పులు చేసి తెరకెక్కించనున్నారు.
ఈ లోపు మరో సినిమా పట్టాలెక్కించేందుకు మహేశ్ ప్రయత్నిస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే 'చందమామ కథలు', 'గరుడవేగ' ఫేమ్ ప్రవీణ్ సత్తారు ఓ కథ వినిపించాడని, కొత్త పంథాలో ఉండటం వల్ల మహేశ్ ఓకే అన్నాడని టాలీవుడ్ వర్గాల్లో వినికిడి. ఏదేమైనా ఈ వార్తలపై స్పష్టత రావాలంటే ఇంకొంత కాలం వేచి ఉండాల్సిందే.
ఇదీ చూడండి.. అతడినే పెళ్లి చేసుకుంటా: అనుష్క