మహేశ్ బాబు ప్రణాళిక మారింది. ఈ హీరో తన తదుపరి చిత్రాన్ని పరశురామ్ దర్శకత్వంలోనే చేయాలని నిర్ణయించుకున్నాడు. మార్చి నుంచి చిత్రీకరణ మొదలు పెట్టనున్నట్టు సమాచారం. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ తదుపరి సినిమా తెరకెక్కాల్సింది.
'సరిలేరు నీకెవ్వరు' ప్రచార కార్యక్రమాల్లో మహేశ్ అదే విషయాన్ని వెల్లడించాడు. కానీ ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు పనులు ఇంకా పూర్తి కాలేదట. అవి ఒక కొలిక్కి రావడానికి ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తుండటం వల్ల ప్రిన్స్ ఆలోపు పరశురామ్‌తో సినిమా చేయాలని నిర్ణయించాడు.
పరశురామ్ చాలా రోజుల కిందటే మహేశ్‌కు కథ చెప్పి ఒప్పించాడు. అందుకు సంబంధించిన స్క్రిప్టు పనులు పూర్తయ్యాయి. దీంతో మహేశ్ మొదట ఈ కథకే పచ్చజెండా ఊపేశాడు. ఇదే ఏడాదిలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని సమాచారం.