ETV Bharat / sitara

'మంచి కథ వస్తే తారక్​ ,చరణ్​తో కలిసి నటిస్తా' - tollywood

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'మహర్షి' చిత్రం మే9న విడుదలవనుంది. ఈ సందర్భంగా తన మనసులోని మాటలను విలేకరులతో పంచుకున్నాడు హీరో మహేశ్ బాబు.

మహేష్
author img

By

Published : May 4, 2019, 10:31 PM IST

మంచి కథ కుదిరితే మరో మల్టీస్టారర్​ చిత్రంలో నటించడానికి సిద్ధమంటున్నాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ నటించిన తాజా చిత్రం 'మహర్షి'. పూజాహెగ్డే హీరోయిన్​గా నటించగా అల్లరి నరేశ్ కీలకపాత్ర పోషించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతీ మూవీస్‌, పీవీపీ సినిమా బ్యానర్లపై దిల్‌రాజు, అశ్వనీదత్‌, ప్రసాత్‌ వి.పొట్లూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మే9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మహేశ్ పలు విషయాలను విలేకరులతో పంచుకున్నాడు.

  • 25 సినిమాగా చేద్దామనే ‘మహర్షి’ కథ ఆపా..

దర్శకుడు వంశీ పైడిపల్లి 40 నిమిషాల పాటు నాకు 'మహర్షి' కథ చెప్పారు. కథ విన్నంత సేపూ భలే అనిపించింది. అప్పటికే నా చేతిలో సినిమాలు ఉన్నందు వల్ల ‘నా 25వ సినిమాను ఈ కథతో చేద్దాం.. నాకోసం కొంతకాలం ఆగుతావా?’ అని వంశీని అడిగాను. అందుకే మా ఇద్దరి కలయికలో సినిమా చేయడానికి ఇంతకాలం పట్టింది.

  • అలాంటి పాత్రలే వస్తున్నాయి ఏం చేద్దాం..

ఒకే గెటప్‌తో సినిమాలు చేస్తున్నానని నాపై విమర్శలు వస్తున్నాయి. కానీ, ఏం చేద్దాం అలాంటి పాత్రలే నా దగ్గరకు వస్తున్నాయి. 'మహర్షి’లో నేను మూడు విభిన్న పాత్రలు పోషించా. విద్యార్థిగా, ఒక సంస్థకు సీఈవోగా, రైతుగా ఇందులో కనిపిస్తా. ఒకే తరహా పాత్రలు చేస్తున్నానని ఫీలవుతున్న అభిమానులకు ఈ సినిమా ఒక ట్రీట్‌లా ఉంటుంది.

  • ఆ పాత్ర నాకు ఛాలెంజ్‌ అనిపించింది..

'మహర్షి'లో నేను చేసిన మూడు పాత్రల్లో స్టూడెంట్‌ పాత్ర, ఆ పాత్రలో వచ్చిన సన్నివేశాలు నాకు ఛాలెంజింగ్‌ అనిపించాయి. ఈ విషయంలో దర్శకుడు వంశీని అభినందించాలి. నాలో నమ్మకాన్ని పెంచడం వల్ల ఆ పాత్రను చాలా సులువుగా చేశా.

  • వాళ్ల పేర్లు చెప్పడం మర్చిపోయా..

'మహర్షి' ప్రీరిలీజ్‌ వేడుక సందర్భంగా ఒకేసారి అభిమానులు వేదికపై రావడం వల్ల దర్శకుడు పూరి జగన్నాథ్‌, సుకుమార్‌ల పేర్లు.. వారితో చేసిన సినిమాలను గుర్తు చేసుకునే అవకాశం నాకు రాలేదు. ‘వన్‌: నేనొక్కడినే’ ఒక కల్ట్‌ క్లాసిక్‌ చిత్రమే కాదు, నా సినిమాల్లో ఉత్తమ చిత్రం. ఈ విషయంలో సుకుమార్‌ను అభినందించక తప్పదు.

mahesh babu interviw
మహేశ్ బాబు
  • నా సినిమాలన్నీ ‘మే లోనే రిలీజ్‌ చేయమంటారు..

‘మే 9న 'మహర్షి’తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టబోతున్నాం. ఈ సినిమా విడుదలయ్యాక ఇక నుంచి నా సినిమాలన్నీ మేలోనే రిలీజ్‌ చేయాలని ఫ్యాన్స్‌ పట్టుబట్టే అవకాశం ఉంది(నవ్వుతూ) ‘మహర్షి’ని నాన్నగారు కూడా చూసి, చాలా సంతోషించారు.

  • అందుకే సుకుమార్‌ సినిమా చేయడం లేదు..

సుకుమార్‌ నాకు ఒక బలమైన ఇతివృత్తం కలిగిన కథను చెప్పాడు. నేనేమో ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగే కథ చేయాలని భావించా. అందుకే సుకుమార్‌ కథను పక్కన పెట్టి, అనిల్‌ రావిపూడి చెప్పిన కథకు ఓటేశా. నా నిర్ణయంతో సుకుమార్‌ ఏకీభవించాడు. భవిష్యత్‌లో మేమిద్దరం తప్పకుండా సినిమా చేస్తాం.

  • వారితో సినిమాలు చేయడం లేదన్నది అవాస్తవం

యువ దర్శకులతో పని చేయాలని నాకూ ఉంది. నా బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయే కథను ఒక్క యువ దర్శకుడు కూడా నాకు ఇప్పటివరకూ వినిపించలేదు. కథ నచ్చితే యువ దర్శకులతో పనిచేయడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు

  • ఆ సినిమాలు చేయాలంటే నాకు భయం

చారిత్రక నేపథ్యం ఉన్న కథల్లో నటించాలంటే నాకు కాస్త భయం. ఒకవేళ నాకు సరిపోయే కథతో, ప్రేక్షకులను మెప్పించగలిగిన దర్శకుడు దొరికితే తప్పకుండా ఆ జానర్‌లో సినిమా చేయడం గురించి ఆలోచిస్తా.

mahesh babu interviw
మహేశ్ బాబు
  • చిన్న చిత్రాలు నిర్మిస్తా

మా సొంత బ్యానర్‌లో వెబ్‌ సిరీస్‌లు, చక్కని కథ, కథనాలతో సాగే చిన్న సినిమాలు తీయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. భవిష్యత్‌లో దీన్ని కొనసాగిస్తాం.

  • నాకే ఆ సినిమా టికెట్లు దొరకలేదు..

అందరూ 'అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌' బాగుందని అంటున్నారు. ఆ సినిమా చూద్దామని ఏఎంబీ సినిమాస్‌లో టికెట్లు అడిగితే, ఏడు షోల వరకూ ఖాళీనే లేదని చెప్పారు(నవ్వులు) నేడో.. రేపో ఈ చిత్రం చూస్తా.

  • ఆ సమయంలో సితార సంతోషం వెలకట్టలేనిది..

నా మైనపు విగ్రహాన్ని చూసి అందరూ చాలా సంతోషించారు. ఇక ఆ సమయంలో నా కూతురులో కనిపించిన ఆనందం వెలకట్టలేనిది.

mahesh babu interviw
మహేశ్ బాబు
  • శ్రీమణి నిజంగా వజ్రమే

'మహర్షి' కోసం పాటల రచయిత శ్రీమణి అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. ఈ సినిమాకు ఆయన పాటలే పెద్ద ఆస్తి.

  • ఆ తర్వాత మల్టీస్టారర్‌ స్క్రిప్ట్‌ రాలేదు..!

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో వెంకటేష్‌తో కలిసి నటించా. అయితే, ఇప్పటివరకూ మరో మల్టీస్టారర్‌ స్క్రిప్ట్‌ నా దగ్గరకు రాలేదు. మల్టీస్టారర్‌ సినిమాలు చేయడం ఆషామాషీ విషయం కాదు. మంచి కథ దొరికితే తారక్‌(ఎన్టీఆర్‌), రామ్‌చరణ్‌లతో సంతోషంగా పనిచేస్తా.

ఇవీ చూడండి.. 'ఆ చిత్రం ఆర్ఎక్స్ 100కు సీక్వెల్ కాదు'

AP Video Delivery Log - 1300 GMT News
Saturday, 4 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1252: Gaza Funeral AP Clients Only 4209280
Funerals in Gaza after intensifying violence
AP-APTN-1247: Thailand Coronation Buddism Patron AP Clients Only 4209279
Thai King declares himself royal patron of Buddhism
AP-APTN-1237: India Cyclone AP Clients Only 4209278
Number killed by Cycline Fani reaches at least 15
AP-APTN-1225: US FL Plane Crash 3 AP Clients Only 4209275
Video of crashed plane in St John's River
AP-APTN-1224: North Macedonia Vatican Pope AP Clients Only 4209274
Skopje prepares for visit by Pope Francis
AP-APTN-1144: Germany Weather No Access Germany 4209273
Winter returns as snow falls in Germany
AP-APTN-1120: Israel Rocket Aftermath AP Clients Only 4209270
Aftermath after rocket from Gaza hits Israeli home
AP-APTN-1115: Luxembourg Funeral AP Clients Only 4209269
Funeral of the Grand Duke of Luxembourg
AP-APTN-1108: Egypt Tomb AP Clients Only 4209267
Egypt annonces discovery of 2,500 year old tomb
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.