ETV Bharat / sitara

బుల్లితెరపై మహేశ్‌-ఎన్టీఆర్.. ఇక పూనకాలే! - rrr

బుల్లితెరపై సూపర్​స్టార్​ మహేశ్ బాబు సందడి చేయనున్నారు. యంగ్​ టైగర్ ఎన్టీఆర్​ వ్యాఖ్యాతగా అలరిస్తోన్న రియాల్టీ గేమ్​ షో 'ఎవరు మీలో కోటీశ్వరులు'లో పాల్గొన్నారు మహేశ్. అందుకు సంబంధించిన పోస్టర్​ విడుదలైంది.

Mahesh Babu
మహేశ్ బాబు
author img

By

Published : Nov 20, 2021, 2:54 PM IST

ఒకరు సూపర్‌స్టార్‌.. మరొకరు యంగ్‌ టైగర్‌.. ఈ ఇద్దరూ స్టార్‌ హీరోల సరదా మాటలకు వేదికైంది 'ఎవరు మీలో కోటీశ్వరులు' (Evaru Meelo Kotiswarulu). యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ (NTR) వ్యాఖ్యాతగా బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తోన్న రియాల్టీ గేమ్‌ షో 'ఎవరు మీలో కోటీశ్వరులు'. మధ్యతరగతి వారి కలలను సాకారం చేయడం సహా వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రారంభమైన ఈ గేమ్‌ షోలో సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు (Mahesh Babu) సందడి చేశారు. ఎన్టీఆర్‌ అడిగిన ప్రశ్నలకు ఫుల్‌ జోష్‌గా సమాధానాలు ఇచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్‌ త్వరలో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సదరు ప్రోగ్రామ్‌ టీమ్‌.. ఓ స్పెషల్‌ పోస్టర్‌ను నెట్టింట్లో షేర్‌ చేసింది. 'పూనకాల ఎపిసోడ్‌ లోడింగ్‌' అని పేర్కొంది. దీంతో నెటిజన్లు.. "మేము కూడా ఇక్కడ వెయిటింగ్‌" అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Mahesh Babu
'ఎవరు మీలో కోటీశ్వరులు' షోలో మహేశ్-తారక్

తారక్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ గేమ్‌ షోలో ఇప్పటివరకు పలువురు స్టార్‌ సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఇందులో గెలుచుకున్న మొత్తాన్ని వాళ్లందరూ ఏదో ఒక స్వచ్ఛంద సంస్థకు విరాళం అందించారు. ప్రారంభ ఎపిసోడ్​లో రామ్‌చరణ్‌ పాల్గొని అలరించారు. రాజమౌళి, కొరటాల శివ, దేవిశ్రీ ప్రసాద్‌, తమన్‌, సమంతలు కూడా ఈ స్టేజ్‌పై తళుక్కున మెరిసి.. ఎన్టీఆర్‌ ప్రశ్నలకు తమదైన శైలిలో సమాధానాలిచ్చారు. ఈ క్రమంలో మహేశ్‌ ఎపిసోడ్‌ (Mahesh Babu NTR) ప్రసారం కానున్న తరుణంలో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వేసవికి మహేశ్..

ఇక సినిమాల పరంగా.. మహేశ్​బాబు నటించిన 'సర్కారు వారి పాట'(sarkaru vaari paata release date) ఏప్రిల్ 1న థియేటర్లలో విడుదల కానుంది. బ్యాంక్​ రుణాల ఎగవేత నేపథ్య కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో మహేశ్​కు జోడీగా కీర్తి సురేశ్(keerthy suresh movies) నటిస్తోంది. తమన్ సంగీతమందిస్తుండగా, పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్​తో నిర్మిస్తోంది.

Mahesh Babu
'సర్కారు వారి పాట'లో మహేశ్

ఇది పూర్తయిన తర్వాత త్రివిక్రమ్​తో(trivikram next movie) కలిసి పనిచేస్తారు మహేశ్. వీరి కాంబినేషన్​లో రాబోయే మూడో చిత్రమిది. ఇంతకు ముందు వీరి కలయికలో వచ్చిన 'అతడు', 'ఖలేజా'.. ప్రేక్షకులను ఎంతలా ఆదరిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు హ్యాట్రిక్ మూవీ అనేసరికి అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్(pooja hegde movies). తమన్ స్వరాలు సమకూర్చుతున్నారు.

rrr
'ఆర్​ఆర్​ఆర్'

సంక్రాతికి 'ఆర్​ఆర్​ఆర్'

రామ్‌చరణ్‌-తారక్‌ మల్టీస్టారర్‌గా ఈ సినిమా సిద్ధమైంది. ఇందులో చరణ్‌ (Ramcharan) అల్లూరి సీతారామరాజుగా.. తారక్‌ (NTR) కొమురంభీమ్‌గా కనిపించనున్నారు. చెర్రీకి జోడీగా ఆలియాభట్‌ (Alibhatt).. ఎన్టీఆర్‌కు జంటగా ఒలీవియా మోరీస్‌ నటిస్తున్నారు. కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు. సుమారు రూ.450 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించినట్లు సమాచారం. సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చూడండి: బాలకృష్ణతో కొరటాల మల్టీస్టారర్‌.. మరో హీరో ఎవరంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.