తెలుగు నటుడు మహేశ్ బాబు కొంతకాలంగా ఇంట్లోనే ఉంటూ వర్కౌట్స్ చేస్తున్నారు. లాక్‌డౌన్ కాలంలో కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడుపుతున్నారు. మహేశ్ ఇంట్లో అత్యాధునిక జిమ్‌తో పాటు స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. తాజాగా ప్రిన్స్ భార్య నమ్రతా శిరోద్కర్ ఇంట్లోని వ్యాయామశాలకు సంబంధించిన ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆ వీడియోకు.. "నెవర్ టూ టైర్డ్ ఫర్ ది జిమ్" అంటూ శీర్షిక పెట్టారు.
- View this post on Instagram
Never too tired for the gym 💪 Hustle hard 🔥 #feelitreelit #feelthethunder #homegym
">
నమ్రత ఈ లాక్‌డౌన్ కాలంలో మహేశ్‌కు సంబంధించిన అనేక ఫొటోలు, వీడియోలు అభిమానులతో పంచుకుంటున్నారు. ప్రస్తుతం ప్రిన్స్.. పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే చిత్రం చేస్తున్నారు. ఇందులో కథానాయికగా కీర్తి సురేశ్ నటిస్తున్నారు.