సినిమాల్లోనే కాకుండా వ్యాపార రంగంలోనూ బిజీ అవుతున్నారు పలువురు సినీ ప్రముఖులు. ఆహార, వినోద రంగాల్లో తమదైన గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్ గచ్చిబౌలిలో 'ఏఎంబీ సినిమాస్' పేరుతో విలాసవంతమైన మల్టీప్లెక్స్‌ను ప్రారంభించాడు హీరో మహేశ్‌బాబు. ఇప్పుడు సొంతంగా దుస్తుల బ్రాండ్‌ను ప్రారంభించనున్నాడు.
"మిమ్మల్ని మరింత చేరువయ్యేందుకు మరో విషయం పంచుకుంటున్నాం. ఈ రహస్యం తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి. http://www.spoyl.in/mahesh-babu" -ట్విట్టర్లో టీమ్ మహేశ్‌బాబు
ఈ నెల 30న విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే 'రౌడీ వేర్'తో హీరో విజయ్ దేవరకొండ, 'బీ ఇస్మార్ట్' పేరుతో దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈ వ్యాపారంలో ఉన్నారు.
ఇది చదవండి: తన కూతురు సితారకు కొత్తగా విషెస్ చెప్పిన ప్రిన్స్ మహేశ్