ETV Bharat / sitara

రెండు సెకన్ల సీన్‌కు.. అన్ని గంటల కష్టమా!

'మగధీర' సినిమాలోని 'పంచదార బొమ్మ' పాట ఎంతో మంది అభిమానుల మనసులను దోచింది. అయితే ఈ సాంగ్​లోని ఓ రెండు సెకన్ల సన్నివేశాన్ని కొన్ని గంటల పాటు చాలా కష్టపడి చిత్రీకరించారు. ఇంతకీ ఆ సీన్​ ఏంటంటే?

maghadheera
మగధీర
author img

By

Published : Dec 28, 2020, 8:16 AM IST

తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వ ప్రతిభను ఒక్కసారిగా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చిత్రం 'మగధీర'. రామ్‌చరణ్‌-కాజల్‌ అగర్వాల్‌ జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం అందుకుంది. ఈ మూవీలోని 'పంచదార బొమ్మ' పాటకు ఎంతటి ప్రజాదరణ దక్కిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ పాట నాటికీ నేటికీ సినీప్రియుల చెవుల్లో మారుమోగుతునే ఉంటుంది. దీన్ని హైదరాబాద్‌లోని గోల్కొండలో చిత్రీకరించారు.

ఇందులోని ఓ సన్నివేశంలో చరణ్‌ తన ఎదుట ఉన్న జలపాతాన్ని వేలితో చీలుస్తూ.. అవతల వైపున్న కాజల్‌ వద్దకు వెళ్తాడు. కేవలం రెండు సెకన్లు ఉండే ఈ సీన్‌ కోసం జక్కన్న బృందం కొన్ని గంటల పాటు కష్టపడాల్సి వచ్చింది. చివరకు అనేక ప్రయత్నాల తర్వాత ఓ చిన్న చాకును చేతుల్లో పెట్టుకుని ఎంతో తెలివిగా ఆ సన్నివేశాన్ని పూర్తి చేశారు చరణ్‌. ఈ ఒక్క సీన్‌ చాలు రాజమౌళి పర్ఫెక్షన్‌ కోసం ఎంతలా కష్టపడతారనేది చెప్పడానికి.

ఈ పాటకు కీరవాణి స్వరాలు సమకూర్చగా.. చంద్రబోస్‌ సాహిత్యాన్ని అందించారు. పూర్వ జన్మల కథాంశంతో ఓ అందమైన ప్రేమకథను మిళితం చేసి.. దానికి తనదైన గ్రాఫిక్స్‌ హంగులు అద్ది వెండితెరపై జక్కన్న చేసిన మాయాజాలం ఆరోజుల్లో సినీప్రియులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద రూ.80 కోట్ల కలెక్షన్లు సాధించి టాలీవుడ్‌లో కొత్త రికార్డులు క్రియేట్ చేసింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి : 'మగధీర'కు 11 ఏళ్లు: రామ్​చరణ్ ప్రత్యేక వీడియో పోస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.