MAA Elections 2021 Resignation: 'మా' అధ్యక్షుడు విష్ణు.. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యుల రాజీనామాను ఆమోదించారు. తన ప్యానెల్ నుంచి ఓడిపోయిన సభ్యులను తిరిగి తన కార్యవర్గంలోకి తీసుకోనున్నట్లు తెలిపారు. మరి ఇలా కొత్త వారిని నియమించడం సాధ్యమేనా? వీరిని తిరిగి తీసుకోవాలంటే 'మా' నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
సాధారణంగా 'మా' అసోసియేషన్‌లో ఒక పదవిలో కొనసాగుతున్న వ్యక్తి స్థానం ఖాళీ అయితే, దాన్ని భర్తీ చేసే అధికారం అధ్యక్షుడికి ఉంది. 'మా' బై లా రూల్ పొజిషన్ 17 ప్రకారం 'మా'లో ఎవరైనా సభ్యుడి పోస్ట్‌కు ఖాళీ ఏర్పడితే, అధ్యక్షుడు, ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయం తీసుకుని దాన్ని భర్తీ చేస్తారు. ఆ పదవికి మరొక వ్యక్తిని నామినేట్ చేస్తారు. అయితే, ఆ నియామకం తర్వాత జరిగే జనరల్ బాడీ మీటింగ్‌లో సభ్యుల అనుమతి కచ్చితంగా తీసుకోవాలి. అదే విధంగా ఏడాదికొకసారి జరిగే సర్వసభ్య సమావేశంలోనూ ఈ నిర్ణయం తీసుకోవచ్చు.
ఉదాహరణకు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసిన శ్రీకాంత్ స్థానంలో విష్ణు ప్యానెల్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన బాబూమోహన్‌ను నామినేట్ చేయవచ్చు. ఇలా ప్రతి పోస్టు ఒక వ్యక్తిని నామినేట్ చేసే అధికారం అధ్యక్షుడికి ఉంది. ఇప్పడీ ప్రకారమే తన ప్యానెల్ నుంచి ఓడిపోయినవారిని నియమించబోతున్నారు 'మా' అధ్యక్షుడు విష్ణు.
ఇదీ చూడండి: MAA Elections: విష్ణు కీలక నిర్ణయం.. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ రాజీనామా ఆమోదం