'మా'లో ఎన్నో(maa elections 2021) సమస్యలున్నాయని.. వాటిని పరిష్కరించడం కోసమే తాను ఎన్నికల్లో పోటీ చేశానని మరోసారి నటుడు ప్రకాశ్‌రాజ్(maa elections prakash raj panel) స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన 'మా' ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్ ఓటమి చవిచూశారు. తాజాగా ఆయన ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నికల్లో ఓడినప్పటికీ తాను 'మా' సభ్యుల సంక్షేమం కోసం ప్రశ్నిస్తూనే ఉంటానని అన్నారు. అనంతరం 'మా' ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
" 'మా' అసోసియేషన్‌లో(maa elections winner 2021) ఎన్నో సమస్యలున్నాయి. వాటిని పరిష్కరించి.. అసోసియేషన్‌ను బాగుచేసి.. సభ్యుల సంక్షేమం కోసమే ఎన్నికల్లో పోటీ చేశాను. ఒకవేళ ఎన్నికల్లో గెలిచి ఉంటే.. నాకంటూ ఒక పవర్ ఉండేది. అసోసియేషన్ అభివృద్ధి కోసం నేను అనుకున్న పనులన్నింటినీ త్వరగా పూర్తి చేయగలిగే వాడిని. ఇప్పుడు నన్ను నమ్మి ఓటు వేసిన సభ్యులందరి కోసం నేను పనిచేస్తాను. వాళ్ల కోసం ప్రశ్నిస్తూనే ఉంటాను. మంచు విష్ణు, అతని ప్యానెల్ సభ్యుల్ని ఈ రెండేళ్లు నిద్రపోనివ్వకుండా చేస్తాను. అసోసియేషన్‌లో అభివృద్ధి కోసం వాళ్లు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారో చెప్పమని ప్రతిసారీ రిపోర్ట్ కార్డ్ అడుగుతా"
"పోలింగ్ జరిగిన రోజు కొన్ని వివాదాలు జరిగాయి. మా ప్యానెల్ సభ్యులతో ప్రత్యర్థి ప్యానెల్(maa elections contestants) వాళ్లు గొడవకు దిగారు. మా వాళ్లని తిట్టారు. ఆ విషయంపై మోహన్‌బాబుతో అప్పుడే మాట్లాడాను. ఆయన సారీ చెప్పారు. నాకు తెలిసినంత వరకూ ఆయన మంచి హాస్యచతురత కలిగిన వ్యక్తి. ఆయన్ని మీరు డిస్టర్బ్ చేయకపోతే ఆయనంత మంచివాళ్లు లేరు. ఒకవేళ మీరు ఆయన్ని డిస్టర్బ్ చేస్తే ఆయన ఏం చేస్తారో ఆయనకే తెలీదు. ఈ ఎన్నికల్లో పలువురు రాజకీయ నాయకులు కూడా భాగమయ్యారు. విష్ణు విజయం కోసం భాజపా వాళ్లు పనిచేశారు" అని ప్రకాశ్‌రాజ్ ఆరోపించారు.
ఇదీ చూడండి: Maa elections 2021: ఆయనతోనే మాకు సమస్య: ప్రకాశ్‌రాజ్